Categories
Standard Post

అందం విషయంలో అపోహ చట్టం తెచ్చింది

అందం గురించిన ఆశలు, అంచనాలు తీవ్రస్థాయికి చేరి ప్రాణాల పైకి తెస్తూ వుంటే చివరకు ప్రభుత్వం కలగజేసుకుని చట్టం తేవలసి వచ్చింది. ఫ్యాషన్ లకు పేరుపొందిన ఫ్రాన్స్ లో సంచలన చట్టం ఒకటి వచ్చింది. బరువు తక్కువ ఉన్న మోడల్స్ నిషేదిస్తూ చేసిన ఈ చట్టం ప్రకారం ప్రతి మోడల్ తన శరీర ఆరోగ్యంతో పాటు బాడీ మాస్ ఇండెక్స్ కు సంబందించి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. శరీరo బరువు అతి తక్కువగా వుంచుకోవడం కోసం తిండి మానేసే మోడల్స్ మోడలింగ్ రంగంలో ఎందరో వున్నారు. వారి ప్రభావంతో సాధారణమైన అమ్మాయిలు కూడా తిండి మానేసి ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ అంచనా ప్రకారం 30000 నుంచి 40000 వేలమంది మహిళల్లో అనోరెగ్జియా ప్రభావం కనిపిస్తుంది. బ్యూటీ పైన వుండే ఇలాంటి అపోహలు, ఈటింగ్ డిజార్డర్ పోగొట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది.

Leave a comment