Categories
Standard Post

ఎండ వేడి కూడా తోడైతే ప్రమాదం

గర్భిణులు ఈ ఎండలకు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణి శరీర ఉష్ణోగ్రత మామూలు కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. బయట ఎండ తగిలితే తీవ్ర అస్వస్థతకు లోనయ్యే ప్రమాదం ఉంది. దాహం వేయడం, నోరు ఎండిపోవడం, ఆకలి లేకపోవడం., చర్మం ఎర్రబారడం, అలసిపోవడం, చలిగా అనిపించడం  వంటివి ఉంటే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని గ్రహించాలి. అప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరం ఎలక్ట్రోలైట్స్‌ను కోల్పేతే కండరాలు తిమ్మిరెక్కుతాయి. నొప్పులు పుడతాయి. ఇలాంటి సమస్య కనుక తలెత్తితే వాళ్ల శరీరానికి నీళ్లు అవసరమని గ్రహించాలి. వేడి వల్ల వచ్చే తిమ్మిర్లు, నొప్పులను నిర్లక్ష్యం చేస్తే తల్లితోపాటు పాటు కడుపులో బిడ్డ కూడా ప్రమాదంలో పడతారు. వడదెబ్బ వల్ల తలనొప్పి, తల తిరిగినట్లు ఉండడం, పల్స్ మరీ వేగంగా, తొందరగా కొట్టుకోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఎండ వేడికి చర్మం కందిపోవచ్చు. గర్భిణులు తేలికగా, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల చమట పట్టకుండా ఉంటుంది.

Leave a comment