Categories
Wahrevaa

మీల్లెట్స్ వంటకాలు తిన్నారా?

కొర్రెలతో అన్నం, అంబలి వంటివి ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో అలవాటైనవి. చిరు ధాన్యాల్లో కొర్రెలు నేటికి ప్రధానంగానే ఉంటూ వస్తున్నాయి. తక్షణ శక్తి నిచ్చే ఈ కొర్రెలు భారత చైనాలలో సహా పలు ఆసియా దేశాల్లో పండిస్తున్నారు. ఉత్తర అమెరికా, యూరోప్ లోనూ వీటిని విస్తారంగా పండిస్తారు. పాస్తా, న్యూడిల్స్ తయారీలో వాడతారు. మిల్లెట్స్ గా పిలిచే ఈ కొర్రెలు ప్రధానమైన ఆహారంగా ఉపయోగ పడే ధాన్యపు పంటగా రెండో స్థానం లో ఉంది. ఈ కొర్రెల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచు పుష్కలంగా ఉంటాయి. స్వల్పంగా కొవ్వులు, విటమిన్ B1,B2, B5, B6, విటమిన్ E వంటి విటమిన్లు, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఎన్ని ఆరోగ్య లాభాలంటే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసి స్థూలకాయాన్ని నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో జీర్ణక్రియ మెరుగు పరుస్తాయి. ఈ మిల్లెట్స్ తో పరవన్నం దగ్గరినుండి ఎన్నో వంటలు చేసుకోవచ్చు. రోజుకో పూట ఇవి తింటే ప్రయోజనమే.

Leave a comment