Categories
Standard Post

లేత రంగు పరదాలు వాడి చూడండి

ఈ ఎండల్లో ఇంట్లో ఉన్నా ఉక్కగానే ఉంటుంది . పెరుగుతున్న ఎండలో ఉదయం ఏడు గంటలనుంచే వేడిగా అనిపిస్తోంది . అందుకే ఇంట్లోకి వేడి రాకుండా కిటికీలకు తప్పనిసరిగా పరదాలు వేయాలి . అవి లేత రంగుల్లో ఉంటే బయట వేడి ఇంట్లోకి రాకుండా ఉంటుంది.సాయంత్రం అవుతుండగానే గుమ్మం కిటికీ తలుపులను తెరచి ఉంచాలి .దీని వల్ల వేడిగాలులు బయటకుపోయి చల్లగాలి వస్తుంది . కిటికీ లోపల పరదా కట్టిన చోట వట్టి వేళ్ళ చాపలు వేలాడదీయాలి . వాటిని నీటితో తడుపుతూ ఉంటే ఇల్లు చల్లగా మంచి సువాసన తో ఉంటాయి . ఈ చాపలు వేడి రానీయవు . సీజన్‌తో సంబంధం లేకుండా ఉన్న కాస్త ఖాళీ స్థలంలో ఇంటిచుట్టు పచ్చని మొక్కలు పెంచటం అలవాటు చేసుకుంటే ఇవి వేడి గాలుల్ని పీల్చేసి ప్రాణవాయువు విడుదల చేస్తాయి . గాలిలోని హానికారక టాక్సిన్లను బయటకు పంపేస్తాయి .

Leave a comment