Categories
WhatsApp

మొక్కలకు ఇవి చాలు.

మొక్కలంటే అబ్దరికీ ఇష్టమే. కష్ట ఖాళీవున్నా ఆకుకూరలు, టమాటో మొక్కలు పెంచాలనుకుంటారు. వీటికి ఎదో ఒక తెగులు పట్టుకుంటానే వుంటుంది. సరదాకి రెండు మొక్కలు పెంచితే ఇలా అయిందని మనస్సు బాధ పడుతూ వుంటుంది.  ఇలాంటి సమయంలో వంటింట్లో దొరికే వస్తువులు కీటకాల్ని చంపేందుకు ఉపయోగించవచ్చు. వంట నూనె సబ్బు పొడి నీళ్ళు కలిపి మొక్కల పైన చల్లవచ్చు. వేప గింజల నూనె చాలా మంచి కీటక నాశిని. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. బూడిద తెగులు నిరోధిస్తుంది. దీన్ని నీళ్ళలో కలిపి సెచికారీ చేయిచ్చు. వెల్లుల్లి వాసనకు కుడా కీటకాలు పోతాయి. వెల్లుల్లిని దంచి, అందులో వంట నూనె , సబ్బునీల్లు కలిపి మొక్కల పై చల్లితే చీడ పీడలు పోతాయి. ముక్కలు చక్కగా ఎదుగుతాయి.

Leave a comment