Categories
Soyagam

వీటిని కలిపితే శిరోజాలకు ఉపయోగం.

తలస్నానం చేసేందుకు సాధారణంగా షాంపు వాడుతున్నాం. ప్రకృతి సహజంగా దొరికే కుంకుడుకాయలు శీకాయలు ఇప్పుడు దొరకని పరిస్ధితి వుంది. అయితే ఇప్పుడు ఇంట్లో వాడుకునే కొన్ని వస్తువులు షాంపులో కలిపి వాడుకుంటే తలకు సంబందించిన ఎన్నో సమస్యలు సులువుగా పోతాయి అంటున్నారు నిపుణులు. ఎన్నో రసాయినాలు కలయికగా వుండే షాంపుల వాళ్ళను, డై వల్లను తల దురద రావచ్చు. షాంపూలో చిన్ని మూత రోజ్ వాటర్ కలిపి వాడుకుంటే ఫలితం వుంటుంది. షాంపూ లో నిమ్మరసం కలిపి వాడుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది. తేనె కలిపి జుట్టు పొడిబారకుండా తేమతో వుంటుంది. జుట్టు రాలిపోతుంటే ఏదైనా అరోమా ఆయిల్ కలిపి రాసుకోవచ్చు. కలబంద లో కలిపి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. వుసిరితో కలిపి జుట్టు కుదుళ్ళు బలపడతాయి.

Leave a comment