• Home
logo
MENU
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
  • ఆధునిక జీవన శైలిని బట్టి ఇంట్లో వాడుకునే వస్తువుల రూపు రేఖలు మారిపోతున్నాయో చివరికి ఇంట్లో పెంచుకునే మొక్కల కుండీలు కూడా ఆధునిక సొగసుల్ని సరికొత్త సాంకేతిక వైజ్ఞానాన్ని కలబోసుకుని మరీ వస్తున్నాయి. బయట ఉద్యోగపు వత్తిడిలో ఇంట్లో పెరిగే మొక్కలకు నీళ్ళు పోయడం మరచిపోతే ఎలా ఆ భయం లేకుండా రోగికి గ్లుకోజ్ ఎక్కించి నట్లు గా మొక్కలకు పోషకాలతో కూడిన నీటిని అందించేలా డిజైన్ చేసిన ఐ.వి ప్లాంట్ పాట్స్ వచ్చాయి. లండన్ కు చెందిన విటమైన కంపెనీ రబ్బర్ గ్లాస్ తో రూపొందించిన కుండీలు చూసేందుకు స్టైల్ గా వుంటాయి. వీటిలో అమర్చిన లోహపు స్టాండ్ కున్న స్క్రు ద్వారా నీళ్ళు మొక్కకు చేరే వేగం నియంత్రించ వచ్చు. అలాగే లాగ్ అండ్ స్కిరల్ కుండీ వుంది. క్వాలే డిజైన్ కంపెని తాయారు చేసిన ఈ కుండీ అడగులో ఓ ఉడత వుంటుంది. నీళ్ళు పోయగానే పైకి వస్తుంది అలా వస్తే నీళ్ళు చాలని అర్ధం. ఉడత కనపడకుండా లోపలికి పొతే నీళ్ళు అయిపోయాయని గుర్తు. అలాగే నీళ్ళు ఎంతున్నాయో కనిపించేలా చేసే ప్రోలి ప్రోపిలిన్ ప్లాస్టిక్ కుండీలు గోడకు అమర్చే రెయిన్ పోట్ లు ఎన్నో రకాలు. ఇంటి అలంకరణ ఇష్టంగా చేసేవాళ్ళు వెతకలే కనీ బోలెడన్ని రకాలు.
    WoW

    నీళ్ళు ఎన్ని కావాలో చెట్టే అడుగుతుంది

    November 29, 2016

    ఆధునిక జీవన శైలిని బట్టి ఇంట్లో వాడుకునే వస్తువుల రూపు రేఖలు మారిపోతున్నాయో చివరికి ఇంట్లో పెంచుకునే మొక్కల కుండీలు కూడా ఆధునిక సొగసుల్ని సరికొత్త సాంకేతిక…

    SHARE
    VIEW
  • ఈ ప్రపంచంలో అతి క్లిష్టమైన అతి ముఖ్యమైన పనేమిటంటే ఒక యువతి, తల్లి అయ్యాక పిల్లల జీవితాన్ని సరైన క్రమంలో నడిపిస్తూ పెంచడం. ఇలా ఒక పర్ఫెక్ట్ మదర్ కు వుండ వలసిన లక్షణాల గురించి ఎలాంటి పరెంటింగ్ క్లాసులు, లెక్చర్లు, పుస్తకాలు ఖచ్చితమైన సూత్రాలు, సందేహాలకు సమాధానాలు వుండవు. పిల్లలు ఎవరికి వారే యూనిక్. ఒకలాగా ఎవ్వల్లు ఉండరు. అమ్మలే తమ పిల్లల తత్వాలు, అవసరాలు సందర్భాలను బట్టి స్వంత నిర్ణయాలు సముచితంగా, సమయానుకూలంగా తీసుకోవాలి. తమ పిల్లల గురించి అందరికంటే అనుభవంలో తెలుసుకోగలిగేది అమ్మలే తప్పుల అభ్యాసమనే పరెంటింగ్ లో అతి ముఖ్యం. ఇది బాగా పని చేస్తుందో అంచనా వేసుకుని ఏది కాదో సరి చేసుకోని పిల్లల విషయంలో వీలును అవసరాన్ని బట్టి మార్పులు చేసుకుంటుంది తల్లి. పరెంటింగ్ ఒక జాబ్ లాంటిది. జస్ట్ హాపెన్స్ అని బుజాలని ఎగరేసేందుకు కుదరదు. ప్రతి నిమిషం ఒక నిరంతర ప్రవాహం లాగా అమ్మా తన ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చి పిల్లల విషయంలో సెక్సెస్ పొందాలి. మంచి అమ్మను అన్న టాగ్ ను తనకు తనే తగిలించుకోవాలి.
    Chinna Maata

    పర్ఫెక్ట్ మదర్ కు ట్రైనింగ్ ఎక్కడ

    November 29, 2016

    ఈ ప్రపంచంలో అతి క్లిష్టమైన అతి ముఖ్యమైన పనేమిటంటే ఒక యువతి, తల్లి అయ్యాక పిల్లల జీవితాన్ని సరైన క్రమంలో నడిపిస్తూ పెంచడం. ఇలా ఒక పర్ఫెక్ట్…

    SHARE
    VIEW
  • ఎప్పుడో ఓసారి మనిషన్నవాడికి తలనొప్పి రావడం అత్యంత సహజం. సరైన నిద్ర లేకపోయినా, సుదీర్ఘ ప్రయాణాలు, అతినిద్ర, మంచి నీళ్ళు సరిగా తగకపోవడం, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం, ఇలాంటి కారణాలు కాకుండా మనం రోజు బుజానికి తగిలించుకునే హ్యాండ్ బ్యాగ్ బరువు కుడా తలనొప్పికి కారణం అవుతుందిట. మనం మోసే చేతి నుంచి మన శరీర బరువులో పది శాతానికి మించి వుంటే, ఆ బరువు ఓత్తిడిగా మారి ముందు బుజాలు, మెడ నొప్పికీ తర్వాత తలనొప్పికీ దారి తిస్తుందిట. అందుకే హ్యాండ్ బ్యాగ్ లో అవసరానికి మించిన వస్తువులు పెట్టుకునే అలవాటు వుంటే స్వస్తి చెప్పండి అంటున్నారు నిపుణులు. బరువు మోయడం తప్పదు అనుకుంటే బ్యాక్ పాకెట్లు ఎలాగో ఫ్యాషన్ కాబట్టి అలా వాడటం మంచిదే. ఒక్కసారి బరువులు ఏమైనా ఎత్తాలంటే ఏళ్ళ బిగువున్నా ఎత్తేస్తాం. దాంతో మొహం కండరాళ్ళు బిగుసుకుని మొహం ఎర్రబడిపోతుంది. అప్పుడు కూడా తలనొప్పి వచ్చె ఆస్కారం వుంది. కదలకుండా గంటల తరబడి కూర్చుంటేనూ, బరువులు మోస్తుంటేనూ కూడా తలనొప్పి పట్టుకోవచ్చు జాగ్రత్త అంటున్నారు నిపుణులు.
    WhatsApp

    హ్యాండ్ బ్యాగ్ బరువు వల్లే ఈ ప్రాబ్లం

    November 29, 2016

    ఎప్పుడో ఓసారి మనిషన్నవాడికి తలనొప్పి రావడం అత్యంత సహజం. సరైన నిద్ర లేకపోయినా, సుదీర్ఘ ప్రయాణాలు, అతినిద్ర, మంచి నీళ్ళు సరిగా తగకపోవడం, ఎక్కువ సేపు కదలకుండా…

    SHARE
    VIEW
  • సలాడ్స్ కోసం తరిగిన కూరగాయ ముక్కల్ని, పండ్ల ముక్కల్ని కొంచం సేపు విడిగా ఉంచిన అవి రంగు మారిపోతాయి. అలాగని సరిగ్గా తినే ముందరే కోయాలంటే టైమ్ సరిపోదు. కొన్ని సార్లు ఇంటికెవరైనా అతిధులు వస్తున్నారంటే ఇలాంటివి కాస్త తీరికగా అందంగా కట్ చేసి పెట్టుకుంటే హడావుడి లేకుండా వుంటుంది. అనిపిస్తుంది అలాంటప్పుడు 'కోల్డ్ బౌల్ ఆన్ ఐస్' వుంటే ఎంతో ఉపయోగ పడుతుంది. గంటా రెండు గంటల పాటు సలాడ్లు, పండ్ల ముక్కలు, అప్పుడే కోసిన వాటిలా తాజాగా వుంటాయి. గట్టి ప్లాస్టిక్ తో చేసిన ఈ బాక్స్ లకు కింద భాగంలో విడిగా తీసి పెట్టుకునే ఇంకో ఆర వుంటుంది. అందులో నిండా ఐస్ ముక్కలు పేర్చి పై భాగంలో పండ్ల ముక్కలు పెడితే ఐస్ చల్లదానం పై వరకు వ్యాపించి గిన్నెలోని ముక్కల్ని ఎక్కువ సేపు తాజాగా ఉంచుతుంది. దీనిలో వుండే ప్లాస్టిక్ సపరేటర్ తీసి ఒకే దాన్లో రెండు మూడు రకాల ముక్కలను అందంగా పేర్చి టేబుల్ పైన పెట్టేస్తే చూసేందుకు ఎంతో బాగుంటుంది.
    Wahrevaa

    చల్ల చల్లగా…….తాజాగా…….ఫ్రెష్ గా…….

    November 29, 2016

    సలాడ్స్ కోసం తరిగిన కూరగాయ ముక్కల్ని, పండ్ల ముక్కల్ని కొంచం సేపు విడిగా ఉంచిన అవి రంగు మారిపోతాయి. అలాగని సరిగ్గా తినే ముందరే కోయాలంటే టైమ్…

    SHARE
    VIEW
  • పోట్టి జుట్టు పొడువుగా అయిపోవాలన్నా పలుచని జుట్టు వొత్తుగా కనిపించాలన్న, రంగులు వేయకుండానే ఏ బంగారు జుట్టు క్షణాల్లో మేరవాలన్నా నో ప్రాబ్లెమ్ అంటున్నారు హెయిర్ స్టయిలిస్ట్ లు అవి విగ్గులు, సవరలు కావు సీక్రేట్ హెయిర్ ఎక్స్ టెన్షన్లు సన్నని హెయిర్ బాండ్స్ కి అతికించిన అందమైన హెయిర్ స్టైల్స్ ఆ బాండ్ తలలో పెట్టుకుంటే చాలు. దానికి అతికించిన పొట్టి జుట్టుతో వత్తుగా కాస్త పొడుగాటి జుట్టు తో పొడుగ్గా, క్షణాల్లో మార్చేయవచ్చు. పొడవాటి పొనీ వేసుకోవాలంటే రెడీ మేడ్ పొనీలున్నాయి. వీటికి అతికించిన రిబ్బన్ ని అసలు జుట్టుకు ముడేస్తే పొడుగాటి పోనీ వస్తుంది. బంగారు రంగు జుట్టు కావాలంటే ఇంతే ఈ సీక్రేట్ హెయిర్ ఎక్స్ టెన్షన్ తో ఏదైనా సులభమే.ఈ కృత్రిమ వెంట్రుకలు కుడా చూసేందుకు చాలా సహజంగా జుట్టు తో కలిసిపోతాయి. ఎటొచ్చి మన జుట్టు లాంటివే చూసి ఎంపిక చేసుకోవాలి.
    Sogasu Chuda Tarama

    క్షణాల్లో కాదు కొన్ని స్టైల్స్

    November 29, 2016

    పోట్టి జుట్టు పొడువుగా అయిపోవాలన్నా పలుచని జుట్టు వొత్తుగా కనిపించాలన్న, రంగులు వేయకుండానే ఏ బంగారు జుట్టు క్షణాల్లో మేరవాలన్నా నో ప్రాబ్లెమ్ అంటున్నారు హెయిర్ స్టయిలిస్ట్…

    SHARE
    VIEW
  • టొమాటోలెన్ని రకాలు అంటే దేశవాళి, హైబ్రీడ్ మహా అయితే చెర్రీ అంటాం, కానీ ప్రపంచ వ్యాప్తంగా 7500 టొమాటో రకాల్ని పండిస్తున్నారు. రకరకాల ఆకారాలు పరిమాణాలు, ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ, ఉదా, గోధుమ, తెలుపు, నలుపు ఇంకా గీతాలు రుచులు వేరువేరుగా వున్నాయి. తక్కువ పులుసులు, తియ్యగా వుండే ఎల్లో పెయర్, ముదురు ఎరుపు రంగు తో ఉప్పుగా వుండే బ్లాక్ క్రీమ్, పలుచని తొక్కలు, తీపి పులుసు రుచి తో బ్రాందీ వైన్, తీపి, వగరు రుచులతోగ్రీన్ సాసేజ్, తియ్యని గార్డెన్ పిచు, చెర్రి గ్రేప్, అన్నింటి కంటే బుల్లిగా చప్పరించేటట్లుగా వుండే తియ్యని కరెంట్ ఇలా ఎన్నో రకాలు. తియ్యని చెర్రి గ్రేప్ టొమాటోలను నేరుగా సలాడ్లలోను ఐస్ క్రీముల్లోను ఉపయోగిస్తారు. మనకి దొరికే ఎర్రని టొమాటోల్లో లైకొపిన్ శాతం ఎక్కువగా వుంటుంది. ఇది అద్భుతమైన యంటీ ఆక్సిడెంట్. ఇది ఆహారానికి ఎంతో అవసరం ఇది ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి మేలే. టొమాటో గుజ్జు ఫేస్ మాస్క్ గా వేస్తే మొటిమలు పోతాయి చర్మం కాంతి వంతంగా అయిపోతుంది. దీన్ని లవ్ ఆపిల్ అని ఫ్రెంచ్ వాళ్ళు. ది ఆపిల్ పారడైజ్ అని జర్మన్లు పిలుస్తారట.
    Wahrevaa

    ది బెస్ట్ అండ్ టేస్టి లవ్ ఆపిల్

    November 29, 2016

    https://scamquestra.com/17-dokazatelsta-i-probely-afery-41.html

    SHARE
    VIEW
  • ఇవాల్టి రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు చేతుల్ని చుట్టేసుకుని కట్టి పడేస్తున్నాయి లెదర్ బ్రేస్ లెట్స్. కాలేజీ కి వెళ్ళే టీనేజర్స్ కి రాక్ స్టార్ లుక్ తెచ్చేలా రకరకాల బ్రేస్ లెట్స్ వస్తున్నాయి. సన్నటి లెదర్ తాళ్ళతో రెండు మూడు రంగులు కలిపి లెదర్ స్ట్రాప్స్ లో అక్షరాలు గుచ్చినవి హృదయాకారం, నక్షత్రాలు, పక్షులు, బొమ్మలు డిజైన్స్ ఎన్నో రకాలు జీన్స్, టీ షర్టులు, స్కర్టులు, గౌన్లు వేటి మేడకైనా సరే బాగుంటాయి. అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలనుకున్నా పెద్ద పెద్ద రెయిన్ స్టోన్స్ పొదిగిన చెల్డ్వాట్ ల డిజైన్లు పువ్వులాంటి లాకెట్లు అమర్చినవి వున్నాయి. సన్నని లెదర్ తాళ్ళు అంటించి అచ్చంగాజుల్లాగా కూడా వున్నాయి బ్రేస్ లెట్స్. ఇవి చేతులకు కొత్త అందానిచ్చాయి అని చెప్పడం లో సందేహం లేదు. ఈ లెదర్ అందాలు ఇప్పుడే ఆన్ లైన్ లో ఆలస్యం ఎందుకు?
    Sogasu Chuda Tarama

    యువత చేతులు చుట్టేస్తూ లెదర్ బ్రేస్ లెట్స్

    November 29, 2016

    ఇవాల్టి రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు చేతుల్ని చుట్టేసుకుని కట్టి పడేస్తున్నాయి లెదర్ బ్రేస్ లెట్స్. కాలేజీ కి వెళ్ళే టీనేజర్స్ కి రాక్ స్టార్ లుక్ తెచ్చేలా…

    SHARE
    VIEW
  • చదువుకు, ఆసక్తికి, వృత్తికి, ఉద్యోగాలకు బలమైన సంబందం వుంది. ఆ మూడు ఒక్కటైతేనే జీవితంలో వృద్ధిలోకి వెళతారు. దీన్ని తలుసుకునే మార్గం సైకో మెట్రిక్ పరీక్ష ద్వారా వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం. కేధరిన్ కుక్ బ్రిగ్స్ తన కుమార్తె ఇసా బెల్ తో కలిసి రూపొందించిన వ్యక్తిత్వ విశ్లేషణ ప్రశ్నా వాలి మయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్(ఎంబిటిపో) గా ప్రాచుర్యం పొందింది. చదువుకుంటే మహిళల్లో పునరుతృత్తి సమధ్యం తగ్గిపోతుందనే అపోహలు కేధరిన్ తండ్రి ఆమెకు ఇంట్లో పాఠాలు చెప్పారు. తర్వాత కేధరిన్ ఉపాధ్యాయునిగా స్తిరపడి కూడా తన కూతుర్ని ఇంట్లోనే చదివించింది. ఈ తల్లీ కూతుళ్ళు అనేక సంవత్సరాల అధ్యయనంలో వ్యక్తిత్వాన్ని కొలత వేసేందుకు ఈ ఎంబిటిఐ పేరుతో ఓ ప్రశ్నా నిధిని అభివృద్ధి చేసారు. ఫార్బ్యున్ 100 కంపెనీల జాబితాలో90 కంపెనీలు ఈ విధానం తోనే తమ ఉద్యోగులను సెలక్ట్ చేస్తారు. కాకపోతే ఏ అమెరికన్ అలోచనకొ సరిపోయే ప్రశ్నలతో అచ్చమైన భారతీయ విద్యార్ధిని ఎలా కొలుస్తారో తెలియదు. చదువుకునే పిల్లల్ని, చడువుకొన్న తల్లులు ఈ ఎంబిటిఐ, ఎం.సి.ఎం.ఎఫ్ అంటే మైభయిస్ మైఫ్యూచర్ వంటి విధానాలని క్షుణ్ణంగా పరిశోదించండి
    WoW

    వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రశ్నో నిధి

    November 29, 2016

    చదువుకు, ఆసక్తికి, వృత్తికి, ఉద్యోగాలకు బలమైన సంబందం వుంది. ఆ మూడు ఒక్కటైతేనే జీవితంలో వృద్ధిలోకి వెళతారు. దీన్ని తలుసుకునే మార్గం సైకో మెట్రిక్ పరీక్ష ద్వారా…

    SHARE
    VIEW
  • క్రిస్టల్ సాల్ట్ కు కాకుండా నేచురల్ గా తయారయ్యే రాతి ఉప్పు కు మాత్రమే ఎన్నో ఆరోగ్యసమస్యలను తగ్గించే గుణం వుంటుదన్నారు ఎక్స్ పర్ట్స్. ఇది స్వచ్చమైనది. ఆయుర్వేద మందుల తయారీలో ఈ ఉప్పే ఉపయోగిస్తారు. ఈ ఉప్పుతో మధుమేహం, ఆస్ట్రియో పార్సిస్, డిప్రెషన్, స్ట్రెస్, కండరాల నొప్పులు, తల దిమ్ముగా వుండటం లాంటి ఎన్నో సమస్యలు పరిష్కరించ వచ్చు. ఈ ఉప్పుతో అధ్యాత్మిక శక్తి కూడా ఉందంటున్నారు. నమ్మకం వున్న వాళ్ళు ఒక చిన్ని గిన్నె లో ఉప్పు కర్పూరం కలిపి ఉంచితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జిలు పోతాయి అంటున్నారు. ఈ నమ్మకాలు అవతల పెడితే స్నానం చేసేటప్పుడు స్క్రుబ్ కోసం ఉప్పును ఉపయోగిస్తే మలినాలు తొలగిపోతాయట. ఉదయం గోరు వెచ్చని నీళ్ళల్లో పావు టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి తాగితే అంతర్గత వ్యవస్థ శుభ్ర పడుతుందిట. ఇల్లు ఫ్లోర్ లు తుడిచేటప్పుడు ఆ నీళ్ళల్లో ఉప్పు వేసి తుడిస్తే ఈగలు రాకుండా వుంటాయి. అలాగే ఉల్లిపాయ వంటివి కోసిన వాసన పోవాలంటే చేతులు ఉప్పు నీటి తో కడుక్కోవాలి.
    Wahrevaa

    క్రిస్టల్ సాల్ట్ కంటే కల్లుప్పు బెస్ట్

    November 29, 2016

    క్రిస్టల్ సాల్ట్ కు కాకుండా నేచురల్ గా తయారయ్యే రాతి ఉప్పు కు మాత్రమే ఎన్నో ఆరోగ్యసమస్యలను తగ్గించే గుణం వుంటుదన్నారు ఎక్స్ పర్ట్స్. ఇది స్వచ్చమైనది….

    SHARE
    VIEW
  • ఈ ఐడియా చాలా బాగుంది. Street store. తమకి అవసరం లేని వాటిని వేరే వాళ్ళకు ఇచ్చేయడం. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు చెందిన స్నేహితులు కైలి లెవిటన్, మ్యాక్స్ పజక్ లు, అద్దె లేని స్థలంలో అందరికి అందుబాటులో వుండే లాగా ఉదయం నుంచి సాయంత్రం దాక రోడ్ పక్కని ఈ స్ట్రీట్ స్టోర్ తెరిచారు. ఇక్కడ పెట్టిన లోగోలు, అవసరమైన సామాగ్రి వివరాలు రాసి పెడితే సాయంత్రం వరకు ఎంతో మంచి దాతలు తోచినవి ఇచ్చారు. అవసరమైన వాళ్ళు వచ్చి తీసుకు పోయారు. మనం దాన ధర్మం చేసే మొహం పెట్టకుండా ఎదుటివాళ్ళ ఆత్మమ గౌరవం కాపాడే సాయం అన్నమాట బరిస్తా లోని భువనేశ్వర్ లో ఏహా ఇప్పటికి 180 నగరాల్లో స్ట్రీట్ స్టోర్స్ తెరిచారట. పది మంది కలసి ఇందుకు యాభై మంది దగ్గర నుంచి వాళ్ళకు అవసరం లేని బట్టలు, బూట్లు, పుస్తకాలు మిగతా ఎలాంటి సామాగ్రి అయినా సరే కలక్ట్ చేసి ఓ వీధి దుఖానం పెట్టేస్తే బహుశ నిరుపేదల అవసరాలు తిరిపోతాయేమొ. కొంతమంది వాలంటీర్లు ఇచ్చి రాతలు వుంటే చాలు వీధి చివర మన దుకాణం పెట్టేయోచ్చు.
    WoW

    ఇలా చేస్తే ఎంత మర్యాద

    November 29, 2016

    ఈ ఐడియా చాలా బాగుంది. Street store. తమకి అవసరం లేని వాటిని వేరే వాళ్ళకు ఇచ్చేయడం. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు చెందిన స్నేహితులు కైలి…

    SHARE
    VIEW
OLDER POST
NEWER POST