• Home
logo
MENU
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
  • నీహారికా , నీకు బుక్స్ చదివే అలవాటు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక పుస్తకం అంటే ఒక మనిషి జీవితకాలపు అనుభవం కదా. మన ఒకళ్ళు జీవితంలో మన అనుభవం మాత్రమే తెలుస్తుంది. ఒక అనుభవం ఉన్న రచయిత రాసిన పుస్తకం చదవటం అంటే అయినా జీవితంలో నేర్చుకున్నది అనుభవించినదీ మనకు తెలిసిరావటం. ఒక మంచి రచయిత ఒక యుద్దాన్ని గురించి ఏం చెప్తారో తెలుసా.. యుద్దమంటే ఇద్దరు శత్రువులు తలపడి బలా బలాలు చూసుకోవటం అనుకుంటాం కదా. రచయిత ఏం చెపుతున్నాడంటే , పోరంటే అనుక్షణ జీవితానుభవం నీ ప్రాణాన్ని నువ్వెంతగా ప్రేమిస్తావో ఎదుటివాడి ప్రాణాన్ని అంతే ప్రేమించటం పోరంటే నువ్వు పూర్తిగా మనిషిగా జీవించటం ... అంటే అర్ధం అయిందా .. పోరంటే యుద్ధం . మనం మనుషులుగా జీవించటం కూడా యుద్ధమే. అంటే ఎపుడు సాటి మనుషులతో పక్షులతో వృక్షాలతో కలిసికట్టుగా ప్రేమగా బతకటం నిర్విరామంగా కృషి చేసి అసలు తప్పులే చేయకపోవటం ఒక వేళ తెలియక చేస్తే ఆ తప్పుని ఖచ్చితంగా వప్పుకోవటం అహాన్ని ద్వేషాన్ని వదులుకోవడం ఎదుటి వాళ్ళ బరువు భుజాన మోయటం ఎప్పుడూ ఎదుటివాళ్ళ సంతోషాన్నే కోరుకోవటం. .. ఇది నిజంగా పోరాటమే.. ఇంత చేయాలంటే మనిషి ఎంత మంచి వాడై పోవాలి. అచ్ఛంగా దేవుడల్లే వుండాలన్నమాట బావుంది కదూ.. కాస్త స్వార్ధం వదులుకొంటే ఇందులో పది శాతం అయినా మనమూ చేయచ్చు. ఏమంటావమ్మా .. ఇలాంటివి చదవటం ఎంత సంతోషం ఎంత అవసరం !!
    Nemalika

    ఒక పుస్తకం ఎంతో నేర్పుతుంద

    January 31, 2017

    https://scamquestra.com/sozdateli/5-aleksandr-prochuhan-35.html

    SHARE
    VIEW
  • టులిప్ తోటల్ని చూస్తుంటే విశాలమైన ప్రపంచం మీద అందమైన కార్పెట్ పరిచినట్లు కనిపిస్తుంది కప్పల్లాగా స్టార్ షేప్స్ లో ఇప్పటికే 75 రకాల రంగుల్లో వున్నాయి/ పెద్ద సైజు లిల్లీలాంటి ఈ పువ్వులే ఇంత అందంగా ఉంటే ఇంకా అలంటి సల్వార్ డిజైన్స్ ఇంకెంత బావుండాలి. వీటి పేరే టులిప్ సల్వార్ ప్యాంట్స్. బ్యాగ్స్ పటియాలా స్టయిల్ లు ఉన్నట్లు ఉంటాయి కానీ ఇదో ప్రత్యేకమైన స్టయిల్. నడుము దగ్గర వెడల్పుగా కాలి మడమ దగ్గరకు వచ్చే సరికి సన్నగా వుండేలా కటింగ్ ఉంటుంది. ఈ అందమైన తులపై సల్వార్ పైకి కుర్తీ కుర్తా లాంగ్ కమీజ్ లు వేసుకోవచ్చు. హాజరయ్యే సందర్భాన్ని బట్టి ఇది డిజైనర్ మెరుపులా లేదా ఎంబ్రాయిడరీనా సాదా డ్రెస్ నా ఎంచుకోవచ్చు. ఇక ఈ డ్రెస్ లో ఎంత మందితో వున్నా టులిప్ పువ్వంత అందంగా ప్రత్యేకంగా కనిపించటం ఖాయం.
    Sogasu Chuda Tarama

    ఈ డ్రెస్ లో పువ్వంత అందం

    January 31, 2017

    టులిప్ తోటల్ని  చూస్తుంటే విశాలమైన ప్రపంచం మీద అందమైన కార్పెట్ పరిచినట్లు కనిపిస్తుంది కప్పల్లాగా స్టార్ షేప్స్  లో ఇప్పటికే 75 రకాల రంగుల్లో వున్నాయి/ పెద్ద…

    SHARE
    VIEW
  • ఇంజినీర్లు కావాలనుకునే అమ్మాయిలకు శుభవార్త. ఇకపై ఐఐటీ లో అమ్మాయిలకు 20 శాతం సీట్లకేటాయింపు ఉండనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ రిజర్వేషన్ అమలు చేయాలనీ ఐఐటీ ల సంయుక్త ప్రవేశ మండలి నిర్ణయించింది. ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వే లో దేశవ్యాప్తంగా ఉన్నత ఇంజినీరింగ్ విద్య అందించే సంస్థల్లో 14 మందికి ఒక్కరే అమ్మాయి ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయిలకు అనుకున్న ఇంజినీరింగ్ విద్య ఐటీ చదువుల పుణ్యంతో ఎక్కువ మంది అమ్మాయిలు ఇంజినీర్లయ్యారు. 2008 తర్వాత ఐటీ ఐటీ సంబంధిత రంగాల్లో మొదలైన ఉద్యోగుల కుదింపు ప్రభావంతో ఈ రంగంలో సంబంధం ఉన్న కంప్యూటర్ సైన్స్ ఎలెక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వంటి ఇంజినీరింగ్ కోర్టుల వైపు అమ్మాయిల రాక తగ్గుతోంది. ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువగా వున్నా తమిళనాడు లోనే ఈ సంఖ్య 3.4 శాతం తగ్గు ముఖం పట్టిందిట. ఇక ఇప్పుడు ఈ రిజర్వేషన్ కేటాయింపులో ఒక్క ఐటీ ని పక్కన పెట్టినా మెకానికల్ సివిల్ కెమికల్ విభాగాల్లో అమ్మాయిల రాక పెరగొచ్చని భావిస్తున్నారు.
    WoW

    అమ్మాయిలకో మంచి అవకాశం

    January 31, 2017

    ఇంజినీర్లు కావాలనుకునే అమ్మాయిలకు శుభవార్త. ఇకపై ఐఐటీ లో అమ్మాయిలకు 20 శాతం సీట్లకేటాయింపు ఉండనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ రిజర్వేషన్ అమలు చేయాలనీ ఐఐటీ…

    SHARE
    VIEW
  • మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు ఎర్రగా ఉంటే నిద్రలేక అంటారు. చమ చాలు పోస్ట్ తగ్గుతుందంటారు. కానీ వైరస్ దానికి కారణం కావచ్చు. అలాగే ఐదారేళ్ళ పిల్లలు పుస్తకాలూ పట్టుకున్న పది నిమిషాలకే పక్కన పెట్టేస్తే మాయోపియా హైపర్ మయోపియా ఆష్టిష్ ,మాటిజం వంటి సమస్య ఉండొచ్చు. పిల్లాడు టీవీ దగ్గరగా చూస్తుంటే అస్తమానం అదో పాడలవాటు టీవీ ని వదులడు అంటారు. అంతే కానీ వాడికి చూపులో ఎదో లోపం వుంది కనుక అలా టీవీ దగ్గరగా చూస్తున్నాడని ఎంత మాత్రం అనుమానించరు. మరీ గ్రామాల్లో పిలల్లు మెల్ల కన్నుతో పుట్టినా అదృష్టమని సంతోషించి ఊరుకుంటారు అది అదృష్టం కానే కాదు. వైద్య పరిభాషలో స్కింట్ అంటారు. చిన్న వయసులోనే చిన్నపాటి శస్త్ర చికిత్సతో సరిచేయచ్చు. తల్లికి మధుమేహం ఉన్న బిడ్డకు కంటి సమస్య లొస్తాయి. ఇవన్నీ డాక్టర్ పరిష్కారించవలిసిన విషయాలు .
    WhatsApp

    సొంత వైద్యం చాలా డేంజర్

    January 31, 2017

    మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు…

    SHARE
    VIEW
  • గర్భ నిరోధక మాత్రలు వాడకం గురించి తెలుస్తుంది వాటి పనితీరు కొంత ప్రాబ్లమ్ గానే ఉంటుంది. ఐపిల్ లాంటి కాంట్రాసెప్టిల్స్ ను గర్భ నిరోధిక పద్ధతులు అనుసరిస్తూ పొరపాటున మరచిపోయిన సమయంలో కావాలి. నెలలో ఒకటి రెండు సార్లే. అలా కాకుండా ఐపిల్ పూర్తీ గర్భనిరోధక సాధనంగా వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల హెచ్చు తగ్గులు ఏర్పడి నెలసరి క్రమం తప్పటం ఎబార్షన్ గర్భం దాల్చకపోవటం వంటి సమస్యలు రావచ్చు. లేదా ఒకవేళ అప్పటికే గర్భం ధరించి ఉంటే ఏ పిల్ ప్రభావం పసి బిడ్డకు జన్యుపరమైన సమస్యతో పుట్టే ప్రమాదం వుంది. నిజానికి ఐ పిల్ పూర్తి స్థాయిలో గర్భధారణకు అడ్డుకోలేదు. ఇది ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టిల్ మాత్రలు 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు వాడాలి అంటే అండాశయాలు పూర్తిగా తయారైన వాళ్ళన్నమాట. అంతేకాకుండా 16 ఏళ్ల వాళ్ళు ఈ మాత్రలు వాడటం మొదలు పెడితే భవిష్యత్తులో దీర్ఘకాల సమస్యలు ఎదుర్కోవాలి. ఈ మాత్రలపైన ఆధారపడకుండా వైద్యుల్ని కలుసుకుని గర్భనిరోధిక ప్రత్యామ్నాయాలు గురించి తెలుసుకోమంటున్నారు ఎక్స్ పెర్ట్స్.
    WhatsApp

    ఆ పిల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి

    January 31, 2017

    https://scamquestra.com/16-starye-afery-opg-27.html

    SHARE
    VIEW
  • సమాజంలో మహిళల పట్ల ఎంత వివక్షత వుందో ప్రకృతి పరంగా కూడా ఎంతో వివక్ష ఉందనిపిస్తుంది కొన్ని అధ్యయనాలు చదివితే. మామూలుగా రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా వుండాలనీ అవి ఎక్కువగా ఉంటే ఆరోగ్యం లక్షణంగా ఉంటుందనీ మెదడు పనితీరు మెరుగు పడటం తో పాటు బరువు తగ్గుతారని ఏనాటి నుంచో అధ్యయనాలు నిరూపించారు. ఇప్పుడో కొత్త రిపోర్ట్ ప్రకారం మహిళలకు మాత్రం అందులో కాస్త వయసు పైబడి లేకుండా మేలు కంటే కీడే జరుగుతుందంటారు. ప్రోటీన్లు ఎక్కువగా వుండే మాంసాహారం తింటే గుండెపోటు వచ్చే ముప్పు రెట్టింపు అవుతుందంటున్నారు. ఆహారంలో కొవ్వు కొలెస్ట్రాల్ సోడియం ఎక్కువైతే ప్రమాదం డైయిరీ ఉత్పత్తులు మాంసం ఫీల్ట్రీ సీ ఫుడ్ బీన్స్ గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో జంతు సంబంధమైన ఉత్పత్తుల నుంచే వచ్చే ప్రోటీన్లు ఎక్కువ హాని చేస్తాయని చెపుతున్నారు. తక్కువ ప్రోటీన్లున్న ఆహారం మాత్రం ఆడవాళ్లకు ఆరోగ్యాన్నిస్తుందని 45 సంవత్సరాల తర్వాత వచ్చే హార్మోన్ల ఇన్ బాలన్స్ తో ఈ సమస్య నుంచి పెరుగుతాయంటున్నారు. ఈ రిపోర్ట్ చూసాక స్త్రీలకు తప్పనిసరిగా వాళ్ళ వయసు బరువు ఎత్తుకు సంబంధించి డైట్ చార్ట్ ఉంటేనే బావుండనిపిస్తుంది.
    WhatsApp

    ప్రోటీన్లు ఎక్కువైతే మహిళలకు రిస్క్

    January 31, 2017

    సమాజంలో మహిళల పట్ల ఎంత వివక్షత వుందో  ప్రకృతి పరంగా కూడా ఎంతో వివక్ష ఉందనిపిస్తుంది కొన్ని అధ్యయనాలు చదివితే. మామూలుగా రోజూవారీ  ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా…

    SHARE
    VIEW
  • ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే అందం రహస్యం ఉందంటున్నారు. ఎక్స్పెర్ట్స్. సింపుల్ గానే వుంది చిట్కా మంచి డికాషన్ కాఫీ ని ఐస్ క్యూబ్స్ ట్రే లో పోసి ఫ్రిజ్ లో పెడితే అవి ఉదయానికి కాఫీ క్యూబ్స్ గ చేతికొస్తాయి. ప్రతి రోజు ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై మర్దనా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి చర్మం నిగారింపు కు వస్తుంది. కండీషనర్ లో రెండు టీ స్పూన్ల గ్రౌండ్ కాఫీ ని కలిపి జుట్టుకు పట్టేస్తే ఐదు నిమిషాల పాటు ఉంచి కడిగేసినా చాలు మెత్తని పచ్చు కుచ్చు లాగా తయారవుతాయి శిరోజాలు. అలాగే నిద్రలేకపోవటం వల్ల కంటి పై వత్తిడి పడటం వల్ల మరే ఇతర కారణాల వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సిర్కిల్స్ ఏర్పడితే అప్పుడు ఒక అర కప్పు కాఫీ దగ్గర పెట్టుకుని దాన్ని కళ్ళ కింద అప్లయ్ చేస్తే చాలు. కా కాస్సేపయ్యాక చల్లని నీళ్లతో కడిగిస్తే సరి. చర్మకణాల పునరుత్పత్తికి కాఫీ గ్రౌండ్స్ బాగా పని కొస్తాయి. దాన్ని స్క్రబ్ మాదిరిగా ఉపయోగించవచ్చు. ఈ పొడితో చర్మం పైన నిదానంగా గుండ్రంగా మర్దనా చేస్తే ఇందులో వుండే కెఫిన్ కొల్లాజైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పద్దతిలో చర్మం ఎంతో సున్నితంగా అందంగా తయారవుతోంది.
    Soyagam

    కాఫీ లో అందం

    January 31, 2017

    ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా  మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే  అందం రహస్యం…

    SHARE
    VIEW
  • పిల్లల్లో వుండే అభ్యాస ధోరణిని పెద్దవాళ్ళే పనికట్టు కుని ప్రోత్సహించాలి. ప్రతి పిల్లల్లోనూ అంతర్లీనంగా ఎదో ఒక విషయం పై ఆసక్తి ఉంటుంది. ముందుగా దాన్ని గుర్తించి ఆదిశగా ప్రోత్సహించటం తల్లి దండ్రుల కర్తవ్యం. ఉదాహరణ కు ఆర్ట్ ఇష్టపడే పిలల్లకు ఆర్ట్ గ్యాలరీలకు తీసుకుపోవాలి. విభిన్నమైన ఆర్ట్ మెటీరియల్స్ ప్రయాగాలకు వారిసి ఎక్స్ పోజ్ చేయాలి. కొత్త విషయాలను వారిలో షేర్ చేయాలి. ప్రతి అంశాన్ని వాళ్ళతో చర్చిస్తూ ఉంటే ఆ కొత్త పరిజ్ణానం పట్ల పిలల్ల చాలా ఎగ్జయిటింగ్ గా ఫీలవుతారు. నేర్చుకోవాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా పిల్లలు చక్కగా రాణిస్తారు. కొత్త భాష కొత్త పదాలు కొత్త కళలు ఆటలు వాళ్ళకి అమితమైన ఉత్సాహం ఇస్తాయి. స్కూల్ లో పిలల్లు సాధించే మార్కుల కంటే వారు ఇష్టపడే విజ్ఞానానికి పెద్దపీట. వేయాలి. దానివల్ల అభ్యాసకులకు అత్యంత పెరుగుతోంది. ఎప్పుడైతే ఇష్టమైన పనిని నేర్చుకోవటాన్ని ఎంజాయ్ చేస్తారు. అప్పుడే మరింతగా ఉత్సాహం పెరుగుతోంది. ఇది చదువు జెనరల్ నాలెడ్జి ఎక్స్ ట్రా క్లరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటికీ వర్తిస్తుంది.
    WhatsApp

    ఆసక్తులు గమనించి ప్రోత్సహిస్తేనే లాభం

    January 31, 2017

    పిల్లల్లో వుండే అభ్యాస ధోరణిని పెద్దవాళ్ళే పనికట్టు కుని ప్రోత్సహించాలి. ప్రతి పిల్లల్లోనూ అంతర్లీనంగా ఎదో ఒక విషయం పై ఆసక్తి ఉంటుంది. ముందుగా దాన్ని గుర్తించి…

    SHARE
    VIEW
  • రింగ్జ్ యిటీ చదువుతుంటేనే ఎదో తమాషాగా వుంది కదూ. ఇది వినండి ఇది ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్ అనే భ్రమ లాంటి జబ్బు అంటున్నారు వైద్యులు. తీరిగ్గా హాయిగా స్నానం చేస్తుంటే ఎక్కడో మొబైల్ మోగినట్టు అనిపిస్తుంది. ఫోన్ పక్కనే ఉంచుకుని హాయిగా టీవీ లో ఏ ప్రోగ్రామో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫోన్ వైబ్రేట్ అయినట్లు లేకపోతే ఎస్. ఎం. ఎస్ వచ్చిన శబ్దమో వినిపిస్తుంది. ఫోన్ చెక్ చేస్తే ఇవేమీ వుండవు. మీకెందుకిలా మనం సందేహపడుతున్నామా ? ఎందుకిలా అనిపిస్తోంది అంటే అదే రింగ్జయిటీ అని సెలవిస్తున్నారు వైద్యులు. అంటే మొబైల్ విన్నట్లు ఓ భ్రమ తో కూడిన సెన్సేషన్. ఇదే ఇందాకా చెప్పుకున్న పొడుగాటి సిండ్రోమ్. ఇది ఈ రోజుల్లో చాలా మందికి అనుభవం మన చెవులకు శబ్దాలు వినే సెన్సెటివ్ సామర్ధ్యం 1000 నుంచి 6000 హిర్జ్ మధ్యలో ఉంటుంది. సెల్ ఫోన్ రింగింగ్ భ్రమ కేటరింగ్ లోకి వస్తుంది . ఇదెలా జరిగిందంటే సెల్ ఫోన్ లపై మనమెంత ఆధారపడి వున్నామా చెప్పేందుకు సంకేతం. ఇది జబ్బేమీ కాదు. కాకపోతే సెల్ ఫోన్స్ కు అతుక్కుపోకుండా కాస్త విశ్రాంతిగా ఉందండీ అని చెపుతోందీ రింగ్జయిటీ .
    WhatsApp

    ఇదో ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్

    January 31, 2017

    రింగ్జ్ యిటీ చదువుతుంటేనే ఎదో తమాషాగా వుంది కదూ. ఇది వినండి ఇది ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్ అనే భ్రమ లాంటి జబ్బు అంటున్నారు వైద్యులు. తీరిగ్గా…

    SHARE
    VIEW
  • ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ నీళ్లు తేనె కలిపి పెదాలను రాసుకుని గంట తర్వాత దూదితో తుడిచేస్తూ ఉంటే ఈ పగుళ్లు పోతాయి . రాత్రి వేళ పడుకునే ముందర తేనె రాసుకున్న ప్రయోజనం ఉంటుంది. పొడి బారిన పెదవులకు ఇది మంచి మందు. అలాగే నెయ్యి రాసుకున్న ఫలితం ఉంటుంది. వేడి నీళ్లల్లో గ్రీన్ టీ బ్యాగ్ పడేసి తీసి దానితో పగుళ్లు వచ్చిన పెదవుల పైన రాసుకున్న నొక్కిపెట్టి ఆ రసం పగుళ్ళకు తగిలేలా చేసినా మంచిది. ఈ టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ పగిలిన పెదవులకు మేలు చేస్తాయి. కీరా దోస ముక్కల్ని గుజ్జుగా చేసి రసం తీసి అందులో దూది ముంచి పెదాలపై వుంచినా మంచి ఫలితం ఉంటుంది. పెదవుల పై చర్మ పొలుసులుగా ఎండిపోతే బేబీ బ్రెష్ తో సున్నితంగా రుద్దేసి ఆలివ్ నూనె తో చక్కెర కలిపి ఐదు నిమిషాల పాటు పెదవులపై మర్దనా చేసి తర్వాత లిప్ బామ్ రాసుకుంటే పెదవులు చక్కగా ఉంటాయి. గులాబీ రేకుల్ని పాలల్లో నానబెట్టి మెత్తగా నూరి పెదవులకు రాసుకున్న పెట్రోలియం జెల్లీ రాసిన పగుళ్లు చాలా వేగంగా తగ్గిపోతాయి.
    Soyagam

    ఇలా చేస్తే పెదవులు గులాబీ రేకుల్లావుంటాయి

    January 31, 2017

    ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ…

    SHARE
    VIEW
OLDER POST