ప్రభుత్వ కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై జరిగే లైంగిక వేధింపుల ఘటనలపై 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కేంద్రప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగినులపై దర్యాప్తు నెలల తరబడిగా సాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ గుర్తించారు. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు వీలుగా 30రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల వివరాలు 8 ప్రభుత్వ శాఖల నుంచి వచ్చాయని, వీటిలో ఆటామిక్ ఎనర్జీ డిపార్టుమెంట్ లో ఎక్కువమంది మహిళలు లైంగికవేధింపులకు గురయ్యారని తేలింది.

Leave a comment