నీహారికా, చాలా మంది ఉద్యోగినులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య ఇది. ఇంట్లో పనులు చేస్తూ వుంటే కాస్తో కూస్తో అటు ఇటు తిరగవలసి వస్తుంది కానీ కార్యాలయంలో ఉద్యోగ వీధుల్లో ఆ మాత్రం అవకాశం వుండదు. కంప్యుటర్ లో ఆన్ లైన్ లో వర్క్ చేస్తూనే ఉండవచ్చు. అలా చేస్తే మధ్యాహ్నం భోజనం కుడా సీట్లో కూర్చునే కానిచ్చేస్తే, మాత్రం శారీరక మానసిక విశ్రాంతి పోయినట్లే. పనితో పాటు ఈ వత్తిడి ప్రభావం కూడా వుంటుంది. అంచేత ఓ ప్రణాళిక ప్రకారం నడుచుకుంటే బావుంటుంది. ఇందులో భోజనానికి కొంత సమయం కేటాయించూకోవడం కుర్చీలో కుర్చుని తినకుండా సహోద్యోగులతో సంబందాలు మెరుగు పడతాయి. ఎంత పని వున్నా ప్రతి గంటకు ఒక సారి కనీసం మూడు నిమిషాలైనా నడవాలి. దీనివల్ల శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. కుర్చీలో కూర్చున్నా సరే శరీరానికి కదలిక ఇచ్చే చిన్ని చిన్ని వ్యాయామాలు చేయాలి. వీటన్నింటికంటే ముందుగా సాటి మన్యుషుల మధ్య గడిపే బంగారం వంటి అవకాశాన్ని వదులుకోకూడదు. సాటి వాళ్ళ స్నేహ సంబందాలే గొప్ప బహుమానం ఎవ్వరికైనా!

Leave a comment