ఆకం సినిమా మలయాయాత్తూరు రామకృష్ణన్ రాసిన యక్షి నవల ఆధారంగా తీసిన మలయాళ థ్రిల్లర్.ఫాహద్ ఫాజిల్, అనుమోల్ నటించారు శ్రీనివాసన్ ఒక కంపెనీలో ఆర్కిటెక్ట్. గర్ల్ ఫ్రెండ్ తో కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయి ప్రమాదంలో అతని మొహం వికృతంగా అయిపోతుంది కాలుకి తగిలిన దెబ్బతో కుంటి తనం వస్తుంది.ఈ మారిన జీవితంలో శ్రీనివాసన్ సినికల్ గా తయారవుతాడు. తర్వాత రాగిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కానీ శ్రీనివాసన్ కు భార్యపట్ల ఒక అనుమానం ఆమె మనిషి కాదు యక్షిణి అని ఆమెను చంపకపోతే తనను చంపేస్తుంది అని అనుకుంటాడు చివరకు ఆమె నదిలో శవం అయి కనిపిస్తుంది. కథ మొత్తం శ్రీనివాసన్ భయానికి సంబంధించింది చక్కని జీవితం గడిపే ఒక మనిషి కొత్తగా వచ్చిన అనాగరికతనంతో ఎలా భయాలకు లోనవుతాడో, మనిషి జీవితంలో అభద్రత ఇలాంటి సంఘటనలకు దారితీస్తుందో ఈ సినిమా చూపిస్తుంది ఫాజిల్ నటన హైలైట్. తప్పక చూడవలసిన సినిమాల్లో ఇదోకటి.

రవిచంద్ర. సి
7093440630 

 

Leave a comment