అమ్మ అందం ,ఆమె తెలివి తేటలు ,ముందు చూపు జాన్వీ కపూర్ పుణికి పుచ్చుకొంది అంటున్నారు సినిమా విమర్శకులు. కేరీర్ ప్రారంభ దశలో శ్రీదేవి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించేది. అన్ని హిట్ సినిమాలే ఇప్పుడు జాన్వీ ఇలాగే ఆలోచిస్తుంది అంటారు .అన్ని భాషల్లోకి రిమేక్ అవుతున్న అర్జున్ రెడ్డి సినిమాలో నటించమనే ఆఫర్ ముందుగా జాన్వీకే వచ్చింది.దాన్నీ ఆమె చాలా సున్నితంగా వద్దనేసిందట.అంత సూపర్ హిట్ సినిమా ఎందుకు వద్దనుకొందో అంటే ఆ సినిమాలో నటిస్తే బోల్డ్ ఇమేజ్ వస్తుందని కేరీర్ ప్రారంభంలోనే అలాంటి ఇమేజ్ తెచ్చుకునేందుకు జాన్వీ ఇష్టపడలేదంటున్నారు.

Leave a comment