రాణి పద్మిని గా దీపికా పడుకొనే నటించిన ఘుమార్, ఘుమారె ఘుమే అంటూ సాగిన రాజస్ధాన్నృత్యం, యౌట్యుబ్ లో విడుదల చేయగానే లక్షల మంది ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేసారు ‘పద్మావతి’ సినిమా గురించి దీపికా ఈ నృత్యం గెవెద్దన కుమారి స్ధాపించిన ఘుమార్ పాఠశాలలో మెళకువలు నేర్చుకుందిట. ఘుమార్ అనేది రాజపుత్ర స్త్రీలు వేడుకల్లో చేసే సంప్రదాయ నృత్యం. నూతన వధువును తోలిసారి వరుడి ఇంటికి ఆహ్వానిస్తూ చేసే నృత్యం ఇది. ఈ పాట చిత్రీకరణలో భారీ సంఖ్యలో ప్రొఫెషనల్ ఘుమార్ డాన్సర్స్ పాలు పంచుకున్నారు. దీపిక అందచందాలు వర్ణించేందుకు మాటలు లేవంటున్నారు విశ్లేషకులు. ఈ పాటని దీపిక నృత్యాన్ని యుట్యూబ్ లో చూడొచ్చు.

Leave a comment