అద్దాల అందం

అమ్మాయిలు అద్ద్దానికి అవినాభావ సంభందం ఉంది. కవులు వాళ్ళ చెక్కిళ్ళను అద్దాలతో పోలుస్తారు. మరి అలాంటి చెక్కిళ్ళ పక్కన అచ్చం అద్దాలను పోదువుకుని జుంకాలు వేలాడుతుంటే ఎంత అందం ఇప్పుడు చెవి దిద్దులు ,గొలుసులు అన్ని రకాల నగల్లోనూ మిర్రర్స్ ఇమిడేలా వాటిని మెరిపించేస్తున్నారు. మిర్రర్ జ్యూలరీఇ పేరుతో ఇప్పుడు అవి మార్కెట్ లో ఉన్నాయి.దాండియా నవరాత్రి మిర్రర్ నెక్లెస్ అయితే మెరిసే వెండి పతకాల్లో అద్దాలు మెరిసి పోతున్నాయి. కొత్తదనం కోరుకునే అమ్మాయిలకు ఈ మిర్రర్ వర్క్ జ్యూలరీ నచ్చేస్తాయి అని చెప్పవచ్చు.