ఇంట్లో అందరూ ఎవారిదారిన వాళ్ళు బిజీగా ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతే, అందరికీ అన్ని అమర్చి పెట్టే అమ్మ ఇంట్లో ఒక్కతే అయిపోయి భోజనం కూడా ఏం తింటాలే ఒక్కదాన్ని అనుకుంటుంది. జపాన్ పరిశోధనలు ఏం చెపుతున్నయంటే ఇలా ఇంట్లో ఉండి పోయె వృద్ధులు, ఇంట్లో ఉండే ఇల్లాలు అద్దం ముందు కూర్చొని భోజనం చేయాలట. అలా అలవాటై పోతే ఒంటరిగా ఉన్నమన్న ఫీలింగ్ పోయి చక్కగా భోజనం చేస్తారట. పైగా అంతసేపు అద్దంలో ప్రతి బింబాన్ని చూసుకుంటే మన పై మనకు ప్రేమ పెరిగి ఆరోగ్యంగా ఉండేలా అన్నీ జాగ్రత్తలు తీసుకొంటామని పరిశోధకులు చెపుతున్నారు.

Leave a comment