అదే అసలైన విజయదశమి

విజయం ఎవరికైనా ఆనందాన్నిస్తుంది చెడు పై మంచి సాధించిన గెలుపు ప్రస్తుతం ప్రపంచంలో అందరికీ మేలు చేస్తుంది దసరా అందుకే అందరి వేడుక నిజానికి దశహర అంటే పది చెడు లక్షణాలను తొలగించమని అర్థం మనిషిలో ఈ పది లక్షణాలు అధర్మం వైపు నడిపించేవే.కామ క్రోధ మోహ, లోభ మద మత్సర, స్వార్ధ అన్యాయ అహంకారం వంటి లక్షణాలు మనిషిని దారి తప్పిస్తాయి. చెడు పనులకు ప్రోత్సహిస్తున్నాయి.అది పరోక్షంగా ఇతరులకు హాని చేస్తాయి కనుక వీటిపై అదుపు సాధించాలి విజయం పొందాలి. ఈ లక్ష్య సాధనలో అమ్మవారి ఆశీస్సులు కావాలి అప్పుడే నవరాత్రి ఉత్సవాలు నిజమైన విజయాలు అందించే విజయదశమిగా వస్తుంది.సకల దేవతల అంశంతో దేవి దర్శనం లభిస్తుంది.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134