చిన్నప్పుడే పిల్లలకు ఆహారపదార్ధాల పట్ల అవగాహన కల్పించాలంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఎదిగే కొద్ది వాళ్ళ చాయిస్ లు సరిగా ఉండకపోవడానికి కారణం ఇదే. చిన్న వయసు నుంచే నేర్పే అలవాట్లు సరైన జీవనశైలిని అలవరుస్తాయి. పిల్లలు ఎవరైన సహజంగా కూల్ డ్రింక్స్,చాక్లెట్ష్ తినడానికి ఇష్టపడతారు. అవి పూర్తి అహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదన్న అవగాహన కల్పించాలి. పండ్లు,కూరగాయల ప్రాధాన్యత తెలపాలి. వాటితో ఆహారం ఎంత రుచిగా చేస్తారో చేసి చూపించాలి. ఆహారం బాగా నమిలి తీంటే జీర్ణమవుతుందని నేర్పాలి. చిరు తిండ్లు పదే పదే ఇవ్వకూడదు. పెరుగు పండ్లు తప్పనిసరిగా ఇవ్వాలి.

Leave a comment