ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నుంచి పనిచేస్తున్న ‘లక్ష్యం’ ప్రస్తుతం 17 రాష్ట్రాల్లోని మురికివాడల్లో సేవలు అందిస్తోంది.వీధి బాలలు బస్తీలు అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన చదువు లక్ష్యం ఆదర్శం అంటోంది. ఆ సంస్థ స్థాపించిన రాశి ఆనంద్. పిల్లలు వాళ్ళ కాళ్లపై వాళ్లు నిలబడాలి అంటే ఎవరో ఒకరి  సాయం కాస్తయినా అందాలి.ఆ ఒక్కళ్ళు నేనే ఎందుకు కాకూడదు అనుకుని లక్ష్యం ప్రారంభించాను ఢిల్లీ లో సిగ్నల్స్ దగ్గర రహదారుల పక్కల చెత్త కుప్పల్లో ఆడుకునే చిన్నపిల్లలను చూశాక నేను వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పి ఇస్తే ఏదైనా వృత్తి విద్యల్లో శిక్షణ ఇప్పిస్తే వాళ్ళ జీవితం అందరిలాగే గడుస్తుంది అనుకున్నాను.ఈ కరోనా లాక్ డౌన్ లో కూడా ఎంతో మంది వ్యక్తిగతంగా కూడా సాయం అందించి పిల్లల కోసం ఎంతో చేశారు అంటోంది రాశి ఆనంద్.

Leave a comment