Categories
Soyagam

అక్కడి చర్మం చాలా సెన్సిటివ్.

కళ్ళ చుట్టూ వుండే చర్మం చాలా పల్చగా వుంటుంది కనుక కళ్ళకింద ఉబ్బినట్లు వుబ్బులు, నల్లని వలయాలు వస్తాయి. సాధారణంగా సుఖంగా నిద్రపోతే ఈ వలయాల నలుపు మాయం అయిపోతాయి. సాధారణంగా మేకప్ తొలగించినపుడు కళ్ళ చుట్టూ గల చర్మం పైన రాష్ గా లాగుతున్నట్లు చేయకుడదు. మధ్య వేలితో క్లెన్సింగ్ జెల్ అప్లయ్ చేయాలి. తడి కాటన్ ఊలుతో  మృదువుగా తుడవాలి. ఒకే డైరెక్షన్ లో తుడవాలి గాని పైకో కిందకోగుండారంగా రుద్దినట్లు తుదవకూడదు. కంటి కలుక, మస్కారా వంటివి తుడిచేతప్పుడు తడి దుది పై క్లెన్సర్ వేసుకుని ఆ కాటన్ ని చూపుడు వేలి చుట్టూ చుట్టుకుని కనురెప్పల పైన కింది వైపు నెమ్మదిగా తుడిస్తే చర్మం దెబ్బతినకుండా వుంటుంది.

Leave a comment