ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 79 లక్షల మంది పిల్లలు ఎన్నో లోపాల తో పుడుతున్నారని, దీనికి కారణం బి3 విటమిన్ లోపమేనని ఆస్ట్రేలియా కు చెందిన పరిశోధకులు చెప్పుతున్నారు. గర్భస్ధ శిశువు పెరుగుదలకు అవసరమైన నికోటిన్ మైడ్ అరినైన్ డైమ్యు క్లియో టైడ్ లోపం కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ పదార్ధం కడుపులో వున్న పిండం పెరుగుదలకు అవసరమైన శక్తికి, జన్యు పదార్ధం అమరిక కు కణాల మధ్య సమయానికి తోడ్పడుతుంది. ఇది లోపిస్తే పిల్లల్లో గుండె వెన్నుముక్కల్లో సమస్యలు గ్రహణం మొర్రి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. ఆకు కూరలు మాంసాహారం లో వుండే విటమిన్ Bc ని, గర్భిణులు తింటే ఇలాంటి సమస్యలు రావని నిపుణులు చెప్పుతున్నారు.

Leave a comment