ఎప్పుడో కొత్త రాతి యుగం నాటికే అంబర్ రత్నాలు వాడుకలో ఉన్నాయ్. కొన్ని రకాల చెట్ల జిగురు గడ్డకట్టి భూమి అట్టడుగుకు చేరి శిలాజాలుగా మారటం వల్ల ఏర్పడిన రత్నాలు ఇవి,శిలాజంగా మారే దశలో వాటి మధ్య చిక్కుకున్న కీటకాలు కూడా రత్నాల మధ్యలో కనిపిస్తాయి. సాధారణంగా పారదర్శకమైన ముదురు పసుపు,తేనె రంగులో ఉంటాయి. దీన్ని జురాసిక్ జెమ్,తృణమణి అని కూడా పిలుస్తారు. అంబర్ రత్నాలను వివిధ ఆభరణాలలో పొదిగి అలంకరించుకొంటారు. ఇది సూర్యుడికి చెందిన రత్నమని,కెంపుకు ప్రత్యామ్నాయిగా ధరించ వచ్చని అంటారు. ఇది ధరిస్తే మానసిక ఆరోగ్యం మెరుగు పడుతోంది అని జ్యోతిష గ్రంధాలు చెపుతాయి. అంబర్ రత్నం పొదిగిన పెండెంట్లు చాలా అందంగా ఉంటాయి.

Leave a comment