వివాహ బంధానికి సంబందించి సెవెన్ ఇయర్స్ ఇచ్ అన్న పదం ఇప్పుడు మూడేళ్ళకే పరిమితం అవుతుంది. కొత్త తరం మహిళలు సమస్యలు ఫేసు చేయడానికి, అసౌకర్యాన్ని ఒర్చుకోవడానికి సిద్దంగా లేరు. పరస్పర అవగాహన లేకపోవడం వైవాహిక బంధం బ్రేక్ అవ్వడానికి కారణం అవుతుంది. వారిని నొప్పించే అంశాల గురించి మగవాళ్ళు సమిక్షించుకోవలసిన సమయం ఇది. తమ భావాల్ని ఎంత గౌరవిస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల ముందు పిల్లల ముందు వారిని కించ పరచనే కూడదు. వివాహ బంధం సక్సెస్ ఫుల్ గా సాగాలంటే  వారి మధ్య ప్రేమా గౌరవాలు వేల్లువిరియాలి. పెళ్ళి అనేది ఆకర్షణ, ఇద్దరి మధ్య ఫిజికల్ కెమిస్ట్రీ మాత్రమే కాదు. ఇంటికి సంబంధించి అన్ని వ్యవహారాల్లో భార్యా భర్తా సమానంగా వుండటం ఆమె వ్యక్తి గత వృత్తి పర, గృహ సంబంధిత కమిట్మెంట్స్ కి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆమె జీవితం పట్ల సంతృప్తిగా వుంటుంది. ఆమె కష్టాన్ని గుర్తించాలి, మెచ్చుకోవాలి. అరుపులు, కేకలకు ఆమె భయప్పడటం లేదు. ఆమెను గౌరవిస్తేనే ఆ కాపురం సజావుగా వుంటుంది.

Leave a comment