నవ్వే పెదవులకు లిప్ స్టిక్ చక్కని అందాన్ని ఇస్తుంది. అయితే ఆ లిప్ స్టిక్ వాడే విషయంలో కొంత శ్రద్ధ,జాగ్రత్త తీసుకోవాలి. పెదవులకు ముదురు రంగు లిప్ స్టిక్ వాడితే చిన్నగా కనిపిస్తాయి .సహాజమైన పెదవులు రంగులు ఉండాలి అనుకొంటే న్యూర్ లేదా క్లియర్ షేడ్స్ గల లిప్ స్టిక్ ఎంచుకోవాలి. అప్పుడే పెదవులు దిద్దుకొన్నాక పైన కాంతి ఇచ్చే ఫైనీ ఫినిస్ తో టచప్ ఇవ్వాలి. లిప్ స్టిక్ వేసే ముందర పెదవులపైన మృతకణాలు లేకుండా పంచదార ,తేనే మిశ్రమం తో పెదవులపైన రాసి నీటి తో కడిగేస్తే బావుంటుంది.

Leave a comment