కేరళలో ఇళ్ళు,దేవాలయాలు ,రిసార్ట్స్, స్పాలు అన్ని చోట్ల రంగు రంగులపూలతో అలంకరించిన ఉరుళి కనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ ఇళ్ళలో ఈ అందమైన సంప్రదాయం కనిపిస్తుంది. నీళ్ళుపోసి పూవులు వేసిన వెడల్పాంటి పాత్రల్లో సువాసనలతో ఉండే కొవ్వుత్తుల్ని కూడా వెలిగిస్తారు. ఒక రకంగా మంచి వాసన వచ్చే సంపెంగ ,గులాబీ,బంతి ,చామంతులతో నింపిన ఉరుళి ఇత్తడి చెంబు ,రాగి బంగారం తో కూడా తయారు చేస్తున్నారు. వీటిలో వినాయకుడు, దశవతారాలు, విష్ణువు ,లక్ష్మి దేవి,రక రకాల దేవతామూర్తులు కూడా కొలువు తీరి చక్కని కళాకృతిలో ఇంటి మధ్యలో పూల కొలనులో అందం ఇస్తుంది.

Leave a comment