వేల సంవత్సరాల క్రితమే కొండ గుహలలో చిత్రించిన పితోరా పెయింటింగ్ మూలాలు దొరికాయి. మాట సంబందమైన చిత్రాలను గోడపైన చిత్రించే వారు పితోరా కళాకారులు ఈ బొమ్మల్లో పసుపు , నీలం, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు కనిపిస్తాయి. వేప లేదా వెదురు కొమ్మల నుంచి, ఈ బొమ్మలు గీసి కుంచె తో తయారు చేసుకునేవారు. కూరగాయలు, పాలు, మహుడా అనే మద్యం ఉపయోగించి రంగులు తయారు చెసుకుంటారు. ఇప్పటికీ ఇవి గుజరాత్ లోని నిరోషా, ఖవాద్, చౌబారీల్లో వస్త్రాల పైన చిత్రిస్తున్నారు. పూజల్లో చేసే క్రితువులు ఆచారాలు, మంత్రాభారణాలు కీర్తనల ఆధారంగానే ఈ పితోరా చిత్ర కళ జీవం పోసుకుంటుంది. ఈ అరుదైన, అపురూపమైన కళా ఖండాలు యాత్రికులు ఇష్టంగా కొంటారు. వస్త్రాల అంచులపై వేసే ఈ ఆర్ట్ చాలా బావుంటుంది కుడా.

Leave a comment