అందని సాయం

సోమవారం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక కార్టూన్ ఒక గృహిణి కష్టానికి అద్దం పడుతుంది.ఇంట్లో మగవాళ్ళు ఎంతో బద్దకంగా చిన్న సాయం కూడా చేయకుండా ఎలాంటి సౌఖ్యం చూసుకుంటారో చెబుతుంది. హ్యాపీ మదర్స్ డే పేరిట వచ్చిన ఈ కార్టున్ లో ఒకావిడ రెండు చేతుల ఇంటి పనులను చేస్తూ ఉంటుంది.ఆమె వీపున ఒక క్ల్లినింగ్ కర్ర కూడా . ఆమె కుక్క మాత్రం ఆమె వెంటే ఉండి క్లీనింగ్ క్లాత్ అందిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లోని తల్లిదండ్రులు బీన్ బ్యాగ్ లో రిలాక్స్ గా కూర్చోని ఇంటి పనుల్లో సాయం చేయడం ఎలా అని లాప్ టాప్ లో వెతుకుతూ ఉంటారు.కుటుంబంలో పురుషుల ధోరణి ఇలా వుంటుంది అని చేప్పేందుకు ఈ కార్టున్ కంటే చక్కని ఉదాహరణ ఇంకోటి ఉండదు.