అందానికి రాజస్థాన్ పట్టు

సాదాపట్టు చక్కని అంచులు స్పెషల్ గా పండుగ ఎట్రాక్షన్ గా ఉండేవి. అలా సాధాగా హెవీ బార్డర్ తో ఉండే చీరెకు భారీగా డిజైన్ చేయిస్తే ఎంబ్రాయిడరీ జోడిస్తే అద్దకాలతో కొత్త హాంగులు తేస్తే ఇంకా ఎంతో అందం. అతి మామూలు నూలు చీరెలకే అద్దకం ఇస్తే రాజస్థానీ పట్టు ఇంకెంత అందం ఉండాలి. ఇవి ప్లెయిన్ కలర్స్ తో వస్తాయి. పట్టు సింథటిక్ మిక్సుడ్ గా వస్తున్నాయి. వీటి అంచులకు మంచి సెర్విన్ వర్క్ చేయిస్తే లంగా ఓణి డిజైన్ తో వచ్చిన చీరెలకు అందమైన హెవీవర్క్ డిజైనర్ బ్లౌజ్ జోడిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సారి పండుగ కోసం రాజస్థానీ పట్టు వెరైటీల కోసం చేడచ్చు. తెక్కలేనన్నీ వర్ణాలతో ఇవి ఎంతో ప్రత్యేకం.