అందాన్నిచ్చే రోజాలు

అన్ని సీజన్ లలోనూ ఎన్నో వర్ణాల్లో గులాబీలు దొరుకుతూనే ఉంటాయి. ఒక్క ఫ్లవర్ నాజులో కాసిన గులాబీలు ఉంచినా చాలా హాలు మొత్తానికి ఒక జీవకళ వచ్చేస్తుంది. అంతే కాదు ఈ గులాబీలతో ,క్రీములు,ఫేస్ వాష్ ల కన్నా మెరుగైన అందం సాధించవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖం పొడిగా కాంతి లేకుండా ఉంటే కాసిన గులాబీ మెత్తగా ముద్ద చేసి పాలు ,తేనె కలిపి ముఖానికి మాస్క్ లాగా వేసి కాసేపటికి గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖం తేమతో మెరిసిపోతుంది. ముఖానికి బాగా పండిన ఫ్రూట్ తో మసాజ్ చేసి ఆ తర్వాత మరిగే నీళ్ళలో గులాబీ రేకులు లావెండర్ నూనె వేసి ఆ నీటితో ముఖానికి ఆవిరి పడితే ముఖం కాంతిగా అయిపోతుంది. మొటిమల మచ్చల్ని కళ్ళచుట్టు వచ్చే నలుపునీ గులాబీలతో చేసే ఫేస్ పాక్ తో పోగొట్టవచ్చు.