అందరూ స్త్రీలే

రీమా కాగ్తీ తీసిన గోల్డ్ సినిమా రాబోతుంది జాతీయ హాకీ క్రీడలో మొదటి గోల్డ్ మెడల్ సంపాదించిన అంశం ఈ సినిమా స్టోరీ .ఒక ఉమెన్ డైరక్టర్ స్పోర్ట్ ఫిలిం డైరక్ట్ చేయటం కూడా ఇదే మొదలు .అక్షయ్ కుమార్ ఇందులో హీరో.ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమా కాస్టింక్ డైరెక్టర్‌ మహిళే ,ఇమె నందిని శ్రీకాంత్‌, శైలజా శర్మ ప్రొడక్షన్ డిజైన్ చేసింది. కాస్ట్యూమ్స్‌ పాయల్‌ సలూజా, సెట్ డెకోరేటర్స్ నికితా జైన్, యాస్మిన్‌ సేథి.ప్రొడక్షన్ కో ఆర్డినేటర్లు సురభి భట్నాగర్, ఇషితా గాలా, బార్బరా మారియా.సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా మేల్ డామినేషనే.అయితేనేం మేం కమర్షియల్ దగ్గర నుంచి అన్ని రకాల సినిమాలు తీయగలం అంటోంది రీమా కాగ్తీ.