కాళ్ళు, మోకాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటే లక్షణంగా ఉంటాయనుకుంటారు కాని అసలు వ్యయామం చేయడం మొదలు పెడుతూనే వాకింగ్ అంటే మాత్రం ప్రాబ్లామ్ అంటున్నారు. ముందు తొడలో పిక్క కండరాలు గట్టిపడే వ్యయామాలు చేయాలి. స్క్వాట్ బ్రిడ్జెస్ హిప్ స్టెబిలిటి వ్యయామాలు క్రమం తప్పకుండా చేయాలి.ఆరు నుంచి ఎనిమిది వారాలు ఈ వ్యయామం అయ్యాక నడక మొదలు పెట్టాలి.లేకుంటే మోకాలి కీలు అరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు, కాళ్ళలో కాస్త నొప్పులు రాగానే వెంటనే వాకింగ్ అంటారు అప్పుడు ఇలాగే కాలు,పిక్క కండరాలు గట్టిపడే వ్యయామం ముందు చేయాలి.ఒక వేళ అప్పుడు ఇంకా నొప్పి అనిపిస్తే ఐస్ ను గుడ్దలో చుట్టి నొప్పి ఉన్న భాగం పైన కాపడం పెట్టాలి.నొప్పి తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించాల్సిందే.

Leave a comment