ఉదయం లేస్తూనే హాడావిడిగా ఫోన్ చేతిలోకి తీసుకోకండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . రాత్రంతా విశ్రాంతి తీసుకొన్న శరీరం వెంటనే స్పీడ్ గా రీస్టార్ట్ అవలేదు . కనీసం పది నిముషాలు స్ట్రబింగ్ వ్యాయామాలు చేసి కండరాలు పూర్తి స్థాయిలో చురుగ్గా మారక అప్పుడు యధావిధిగా కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చు అలాగే గృహిణులు పగలంతా పనులు పూర్తి చేసుకొంటూ, రాత్రి వేళ విశ్రాంతి గా పడుకొంటారు నిద్రలో జీవ క్రియలు మందగిస్తాయి . రక్తంలో చక్కెర స్థాయి లు తగ్గుతాయి . రోజు ప్రారంభం కావటానికి శరీరం ,శక్తి పుంజు కొనేందుకు లేచిన 40 నిముషాల్లో గుడ్లు ,పండ్లు ,పాలు ,తృణ ధాన్యాలు పిడికెడు నట్స్ తీసుకొని ఆ తరువాత రోజువారీ వ్యవహారంలోకి అడుగుపెట్టాలి . లేవగానే ఒక అరగంట విశ్రాంతి తరువాత ఫోన్ వైపు చేయి చాపండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment