మనం తినే ఎన్నో ఆహార పదార్ధాలు పులియనిచ్చి తయారు చేస్తాం. పెరుగు,ఇడ్లీ,దోశ ఇవన్ని పులియబెట్టి చేసేవే. సరికొత్త తాజా పరిశోధనలో పులుయబెట్టిన పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు,విటమిన్ డీ,కాల్షియం పుష్కలంగా ఉండటంతో అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల ఉత్పత్తులో పెరుగు ,మజ్జిగ,చీజ్ మొదలైనవి తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. రెండు వేల మంది ఆహారపు అలవాట్ల పై ఇరవై ఏళ్ళ పాటు జరిగిన ఈ పరిశోధనలో హృద్రోగులు సంఖ్య తక్కువగా ఉన్నట్లూ తేలింది. రాత్రిపూట మజ్జిగలో అన్నం వేసి పులియబెట్టి తరువాత తింటే అది ఆరోగ్యానికి ఎంతో మేలు అని చెబుతున్నారు.

Leave a comment