నీహారికా,

ఒక అద్యాయినం అశావాదులకు ఆయుర్దాయం ఎక్కువని చెప్పుతుంది. జీవితాన్ని ఆనందంగా, తృప్తి తో బతుకుతారు గనుక ఎక్కువ కాలం జీవిస్తారట. ఇందుకు భిన్నంగా నిరాశ పడే వారు తమ వ్యతిరేక  ఆలోచనల వల్ల జీవితంలో కలిసి రావడం లేదనే ఆలోచన వల్లనే సమస్యల్లో చిక్కుకుంటారు. ఎంత నమ్మకం లేకపోతె చీమ తనకంటే బరువైన గింజను మోసుకు పోగలుగుతుంది. ఆ చిన్ని జీవి కంటే దుర్బలుదా మనిషి? ఈ అవగాహన లేకనే జీవితంలో నిరాశావాదులుగా వుంటారు కొంత మంది. ప్రతి అంశాన్ని ఓర్పుతో నేర్పుతో విశ్లేషించి ఒకటి కంటే ఎక్కువ పరిష్కార మర్ఘాలు ఆశావాదులు కనుక్కోగలుగుతారు. ఆశావాదం ఒక మహత్తరమైన టానిక్. బాధలు, భయాలు వేదించనివ్వని మంచి మందు. కస్టాలు నిలువ వని, బాధలు వేదిన్చావని, ఎదురుగ్గా బంగారు భవిష్యట్టు వుందని మబ్బులు వీడిపోయి సూర్య దార్శనం అయినట్లు సమస్యలు చాలా త్వరలో పోతాయని నమ్మగాలిగిన వాడే ఆశాజీవి. వాళ్లకు ఆయుర్దాయం, ఆరోగ్యం ఎక్కువే నంటే ఆశ్చర్యం ఏముందీ?

Leave a comment