ఆష్లే బైడెన్

జిల్,జో బైడెన్ ల కుమార్తె ఆష్లే బైడెన్ సామాజిక కార్యకర్త గా ఫ్యాషన్ డిజైనర్ గా ఆమె వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. స్కూల్లో చదువుతూ ఉండగానే ఒక కాస్మెటిక్ కంపెనీ తమ ఉత్పత్తులను జంతువుల చర్మాలతో తయారు చేస్తుందని  తెలుసుకుని దాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాలు మొదలుపెట్టింది. డాల్ఫిన్ లా పరిరక్షణ కోసం కాంగ్రెస్ సెనేటర్ బార్బరా బాక్సర్ తో కలిసి పని చేసేలా తండ్రిని ప్రభావితం చేశారు దాని ఫలితంగా 1990 లో డాల్ఫిన్ ప్రొటెక్షన్ కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది సామాజిక సేవ తనకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం అంటారు ఆష్లే బైడెన్ .