నీహారికా,

ఎంత వేగం తో నడుస్తుందీ ప్రపంచం. సాధించిన దానిని ఆస్వాదించ లేనంత వేగం జీవితంలోకి వచ్చేసింది. చదువు ముగిసిన క్షణం నుంచి లక్ష్యాల్లో మొదలవ్వుతున్నాయి. ఉద్యోగం, కారు, ఇల్లు జీవితంలో ఇక సంతృప్తి లేదు ఒక కప్ అందుకుంటూ ఇంకో కప్ గురించి ఆలోచిస్తున్నట్లు వుంది. ఈ టార్గెట్స్ కోసం భార్యా భర్తలు ఇద్దరు కుడా కలిసి జేవించడంలో వున్నా ఆనందం అనుభవించడం లేదు కలిసి సంపాదిస్తున్నారు, సేవ చేస్తున్నార్. కానీ కొన్ని గంటలయినా కలిసి జీవితాన్ని అనుభవిస్తున్నారా అంటే లేదు. పిల్లలతో పది నిమిషాలు షేర్ చేస్తున్నారా? అంటే అదీ లేదు. గంటల కొద్దీ పనీ, పనీ ఇక జీవిత మాధ్యమం ఎల్లా అనుభవంలోకి వస్తుంది. బహుశా ఈ లోపమే ఈ కాలపు భార్యా భర్తల మధ్య బ్రేకప్స్ తెస్తుందేమో… ఇప్పుడొచ్చిన ఒక రిపోర్ట్ బ్రేకప్స్ ఎక్కువవ్వుతున్నాయి. పెళ్ళయినా రెండు ముదేళ్ళకే ఒక పంగాలా జరుపుకోవలసిన జీవితాన్ని తున్చుకోవడం లో ఎవరి పాత్ర ఎంతెంత? ఈ కాలపు యువత ఆలోచిస్తే బావుండు

Leave a comment