ముఖానికి కనుబొమ్మలు అందం వాటిని ట్విజర్ తో తీర్చిదిద్దటంలో కొన్ని మెలకువలు పాటించండి అంటున్నారు ఎక్సపర్ట్స్ .ముందుగా రెండు అద్దాల తీసుకొని ట్విజర్ తో కనుబొమ్మలు తొలగించేప్పుడు భూతద్దం వాడాలి. కనుబొమ్మల ఆకారం సరి చూసుకునేందుకు మామూలు అద్దాన్ని ఉపయోగించాలి. అలాగే తీరైన ఆకృతి కోసం ఒకే రోజు వెంట్రుకలు తొలగించవద్దు రోజుకు కొన్ని చొప్పున కనుబొమ్మలు ఆకృతి దెబ్బతినకుండా తొలగించాలి. కనుబొమ్మల వెంట్రుకలను కింది వైపు నుంచి తొలగిస్తూ రావాలి. కొత్త రూపం కోసం అసలు ప్రయత్నం చేయవద్దు సహజ సిద్ధంగా ఏర్పడిన ఆకారాన్ని బట్టి అదనంగా పెరిగిన వెంట్రుకలను మాత్రమే సరి చేయాలి.

Leave a comment