ఆత్మ నిర్భర్ పేరుతో మహిళల కోసం ఒక డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించింది ఉత్తరప్రదేశ్లోని మధుర లో నివసించే పావని. తన తల్లి రేఖ కి స్వయంగా స్కూటీ నడపడం నేర్పించక తన తల్లి లాగా ఎంతోమంది మహిళల కోసం మహిళలే నడిపే డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలి అనుకున్నది పావని. ఇప్పటివరకు ఈ డ్రైవింగ్ స్కూల్ ద్వారా 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వెయ్యి మంది గృహిణులు ఉద్యోగినులు  ద్విచక్ర వాహనాలు నడపడం లో శిక్షణ పొందారు. మధురై లో మొదలైన ఈ ఆత్మ నిర్భర్ శాఖ లు ప్రస్తుతం జైపూర్, భారత్ పూర్, అలిమ్మర్, లక్నౌ, జోద్పూర్, ఆగ్రా వరకు విస్తరించాయి.పావని ప్రతి సంవత్సరం స్కూటీ సేఫ్టీ ర్యాలీ పేదల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తోంది.

Leave a comment