బాదం నూనె మసాజ్ మంచింది

గోళ్ళు పెలుసుగా అయిపోయి విరిగిపోతూ ఉంటాయి. మంచి నాణ్యమైన గోళ్ళ రంగు వాడినా మానిక్యూర్ తో కూడా ప్రయోజనం అనిపించకపోతే ఇక వాటికి సరైన పోషణ లేక ఇలా జరుగుతుందని అనుకోవాలి.బాదం నూనె నిర్జీవంగా అయిన గోళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కప్పు గ్రీన్ టీ నీటిలో కాసేపు గోళ్ళు ఉంచినా సరే వాటి మరకలు పోయి పెలుసుదనం తగ్గుతుంది. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల కూడా ఇందులో ఉండే మెగ్నీషియం,పొటాషియం,జింక్,మాంస కృత్తులు ఎక్కువగా ఉండటం వల్ల గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.