కొవ్వు ,కొలెస్ట్రాల్ చాలా తక్కువ శాతం అనిపించే ఖర్జూరాలు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలున్నాయి. విటమిన్లు ,ఖనిజాలు ,మాంసాకృత్తులు ఖర్జూరాల్లో సమృద్దిగా ఉంటాయి. వీటిలోని గ్లూకోజ్, సుక్రోజ్ ,ప్రక్టోజ్ల వల్ల తీసుకొన్న వెంటనే తక్షణ శక్తి వస్తుంది. అలసట మాయం అవుతుంది. ఖర్జూరాలు పాలతో కలిపి తీసుకొన్న కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో పోటాషియం,కాల్షియంఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పోషకాలు ఎముకలకు మేలు చేస్తాయి. చెడు కొలెస్టాల్ తగ్గించేస్తాయి, అరుగుదలకు సహాకరిస్తాయి. వీటిలో ఇనుము శాతం కూడా ఎక్కువే. ఎండు ఖర్జూరాలు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే వీటిలో సహా తీసుకొంటే మలబద్దకం సమస్య రాదు. బరువు పెరగాలను కొనే వారికి ఇవి చక్కని ఆహారం.

Leave a comment