నట్స్ జాతికి చెందిన హజల్ నట్ పై పెంకు లేత గోదుమరంగులో మెరుస్తూ కనిపిస్తుంది.లోపల గింజ తెల్లగా లేత గోధుమ రంగులో కానీ తెల్లగా కానీ ఉంటుంది. ఈ హజల్ నట్ తో లభించే ఫో వైట్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వెన్నుముక ,మెదడు సరిగ్గా ఎదిగేలా చేస్తుందని అద్యాయనకారులు చెబుతున్నారు.ప్రాచీన కాలంలో ఈ హజల్ నట్ మొక్కలను రోమ్ లో బహుమతిగా ఇచ్చుకునే సంప్రదాయం ఉంది.ఈ మొక్క సంతోషాన్నిస్తుందని నమ్మకం,ఫ్రెంచ్ ఆచారాల ప్రకారం ఈ నట్ ఫలదీకరణకు సారవంతమైన స్థితికి సంకేతం.వీటిలో మెఘ్నీషియం బాగా లభిస్తుంది. ఇది మన శరీరంలో పొటాషియం,కాల్షీయం స్థాయిలని నియంత్రిస్తుంది.దీని వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.దీని వల్ల్ల అధిక బరువు తగ్గుతుంది.

Leave a comment