ఫ్రిజ్ లో ఎన్నో రకాల వస్తువులు పెట్టేస్తాం. పాలు, పెరుగు, కూరలు కాకుండా మిగిలిన ఆహార పదార్ధాలు, ఫ్రోజన్ ఫుడ్ తో ఫ్రిజ్ ను నింపేసి దాన్ని సాధారణంగా అలా వదిలేస్తాం. దాంన్తో ఫ్రిజ్ తెరవగానే గుప్పుమంటూ వాసనా వచ్చేస్తూ వుంటుంది. ఫ్రిజ్ లో కంటెయినర్లు పాత్రలు చాలా జాగ్రత్తగా సర్దుకోవాలి. వండిన పదార్ధాలు, పాలు, పెరుగు గిన్నెల పైన మూతలు తప్పనిసరిగా పెట్టాలి. పండ్లు, రకరకాల కాయగూరలు విడివిడిగా కవర్లలో ఉంచాలి. మరీ వాసనగా అనిపిస్తే బేకింగ్ సోడాని ఓ కంటైనర్ లో పోసి ఫ్రిజ్ లో పెట్టేస్తే అది దుర్వాసనలను పీల్చుకుంటుంది. అలాగే ఓ ప్లేట్ లో కష్ట కాఫీ పొడి పోసి ఫ్రిజ్ లో పెట్టినా ఆ వాసనలను కాఫీ పొడి పీల్చేసుకుంటుంది.

Leave a comment