వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల నేల తడిగా ఉండటం వల్ల కూడా రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.వ్యక్తిగత శుభ్రత పాటించాలి అలాగే ధరించే దుస్తులు,లో దుస్తులు శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి ఎవరి వస్తువులు వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఇతరులతో పంచు కోవటం వల్ల ఇన్ ఫెక్షన్లు వస్తాయి. డైట్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇన్ ఫెక్షన్లు రాకుండా మసాలాలు వేసిన ఫుడ్ మానేయాలి. దాహం గా లేకపోయినా శరీరం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు తాగుతూ ఉండాలి. చర్మ వ్యాధులు రాకుండా రోజంతా వేడి నీళ్లు తాగుతూ ఉండాలి డయాబెటిక్ ఉన్నవాళ్ళు చర్మ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్షంలో తడిస్తే వెంటనే జుట్టును ఆరబెట్టుకోని పొడి దుస్తులను ధరించాలి.

Leave a comment