భారతీయ దుస్తులు సహజంగానే స్టయిల్ గా ఉంటాయి. నిజానికి ఇండియన్ దుస్తులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా వున్నప్పుడు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. చుడీదార్లు, చీరలు, కుర్తాలు ఏవైనా వాతావరణం వేడిగా వుంటే శరీరానికి సౌకర్యం ఇస్తాయి. చీర ధరించినప్పుడు బ్లౌజ్ పొడుగ్గా నడుము వరకు వుండాలి. అప్పుడు డిజైనర్ జాకెట్ల అందం తెలుస్తుంది. సాదా చీరలపైన గాడీగా వుండే వర్క్ బ్లౌజుల అందం నడుమును తాకుతూ వుండాలి. సిల్క్, కాటన్ ఏవైనా క్లోజ్ ఫిట్టింగ్ వుండాలి. అప్పుడే చీర అందం పెరిగినట్లు వుంటుంది. పొడవాటి ఎలైన్ కోట్స్ ఎప్పుడూ అందంగానే ఉంటాయి. బెల్టేడ్ ట్రెండ్ కోట్లు ట్రెండీగా ఉంటాయి. షగ్స్ కాప్స్ బాగుంటాయి. షాల్స్ ఇతరాత్రా సాంప్రదాయ కవరింగ్ అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు.

Leave a comment