ఉపవాసం చేయడం కంటే భోజన వేళలు మార్చుకుంటే ప్రయోజనం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఫాస్టింగ్ వైపు ఆలోచిస్తారు. కాని అలా పొట్ట మార్చడం ప్రమాదం అంటున్నారు యూనివర్సీటి ఆఫ్ సర్రే కి చెందిన నిపుణులు. ఉదయం తినే అల్పాహారం 8 ,9 గంటల మధ్య తినమంటున్నారు. లంచ్ టైం మార్చకుండా రాత్రి భోజనాన్ని 5,6 గంటలకే ముగిస్తే మంచిది అంటున్నారు. ఇలా చేస్తే ఫాస్టింగ్ చేయకుండా బరువు తగ్గడం ఈజీ అంటున్నారు. సూర్య అస్తమయం తర్వాత జీవక్రియ మందగిస్తుంది. మళ్ళి ఉదయం వరకు అంటే పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు ఏమి తినరు కనుక అది ఉపవాసంతో సమానమని పేరుకున్న కొవ్వులు కరుగుతాయినెమ్మదిగా శరీరం బరువు తగ్గుతుందంటున్నారు.

Leave a comment