పసిబిడ్డకు అమృతం కంటే  తల్లి పాలే ఎక్కువ పాలు వీలైనవి అంటారు. పాపాయికి ఆరోగ్య కవచం తల్లిపాలే. ప్రసవం అయిన వెంటనే బిడ్డకోసం ఉబికి వచ్చే తల్లి పాలలో పోషకాలు, యాంటీ బాడీలు నిండగా ఉంటాయి. ఎన్నో ఇన్ ఫెక్షన్ల నుంచి పాపాయిని కాపాడతాయి. ఈ పాలల్లో కొవ్వులు, చేక్కరాలు, నీళ్ళు మాంసాకృతులు పుష్కలంగా వుంటాయి కనుక బుద్దకు అదనంగా ఎలాంటి ఆహారం ఇవ్వనక్కరలేదు. పాపాయికి కనీసం ఆరునెలల పాటు పాలు ఇస్తే వీటిలోని పోషకాలు, భవిష్యత్తులో మధుమేహం, రొమ్ము కాన్సర్, గర్భాశయ ముఖ ద్వార కాన్సర్ వంటి ప్రాణంతకమైన జబ్బులు రానీయకుండా కాపాడతాయి. అలాగే  చిన్న వయస్సులో వుబకాయం ఇన్ ఫెక్షన్లు, పిల్లల్లో వచ్చే సాధారణమైన అనారొగ్యాలు అంటువ్యాధులు రానీయవు. తల్లిలో అక్సిటోసిన్ హార్మోన్ కారణంగా బిడ్డకు కవల్సిన పాలు నిండుగా ఉంటాయి.

Leave a comment