పాలపళ్ళు కనిపించాక పిల్లలకు బ్రెషింగ్ చేయోచ్చు అంటారు డాక్టర్లు. పేస్ట్ బ్రెష్ పైన వేసి నోట్లో పెట్టగానే పిల్లలు చప్పరించేస్తుంటారు.సాధరణంగా ఫ్లోరైడ్ కలిగిన పేస్ట్ ఇళ్ళలో వాడుతుంటారు. ఈ ఫ్లోరైడ్ వాడకం వల్ల దంతాల ఆరోగ్యం బావుంటుందంటారు.కానీ పిల్లలు ఈ పేస్ట్ తినేయడం మటుకు వాళ్ళకు ఆరోగ్యకరం కాదు.బ్రెష్ చేసేటప్పుడు బియ్యపు గింజపరిమాణంలో వేస్తే చాలు. మూడేళ్ళు వచ్చాక దాన్ని కాస్త పెంచుతూ పోవచ్చు.ఆరేళ్ళు వచ్చాక బ్రెష్ నిండా పేస్ట్ వేసిన ఏంకాదు.సంవత్సరం నిండాక దంతవైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి.

Leave a comment