బ్రా సైజు ఎప్పుడు ఒకేలా ఉంటుందని అనుకోకండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . బరువులో వచ్చే మార్పులను బట్టి బ్రా సైజ్ మారుతుంది . సైజు ను సరిగ్గా కొలుచుకోవాలి . టేప్ తో వీపు నుంచి వక్షోజాల మీదిగా ముందుకు తెచ్చి నంబర్ చూసుకోవాలి . బ్రాలను మడత పెట్టకూడదు . చిన్న హేంగర్ లకు తగిలించాలి . ట్రయిల్ రూమ్ లో సరిచూసుకొన్నాకే కొనుక్కోవాలి వాషింగ్ మిషన్ లో ఉతికేప్పుడు హుక్ పెట్టి వాషర్ బ్యాగ్ లో వేసి ఉతకాలి . డ్రయర్ లో పెట్టకూడదు . కరెక్ట్ సైజ్ కాకుండా కాస్త వదులుగా ఉన్నవి మొదటి హుక్ పెట్టుకొంటే సరిపోయే వాటిని ఎంచుకోవాలి . కొన్ని ఉతుకుల తర్వాత వాటిని టైట్ చేసుకోవచ్చు . బ్రాండ్ ని చూసి కొనటం కంటే సరైన సైజు ఎంచుకోవటం ముఖ్యం .

Leave a comment