www. winover cancer net అనే పేరుతో ఓ బ్లాగ్ క్రియేట్ చేసారు కవిత. ఈమెది ఫదీరాబాద్, భర్త చార్టెడ్ అకౌంటెంట్. ఇద్దరు పిల్లలు . అతనికి కేన్సర్ సోకింది. పదిశాతం మాత్రమే బతికే అవకాశం అన్నారు డాక్టర్లు. నెలల తరబడి భర్త గురించి హాస్పటల్లో వుంది కవిత. అతనికి కాన్సర్ నయం అయింది. అతనిపేరు అరుణ్. ఈ అనుభవంతో ఇద్దరు కలిసి కాన్సర్ పేషంట్స్ కోసం, రాయితీ ధరలో మనదులు కాన్సర్ నయమైన వారికి ఉపాధి ఎన్నో ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఇలా ఎంతో సేవ్ చేస్తున్నారు. కాన్సర్ సోకినా ఆడవాళ్ళ కోసం ప్రాస్తటిక్ లో దుస్తుల తయారీ పై దృష్టి  పెట్టారు. కవితా గుప్తా చర్మానికి హాని చేయని బ్రా తయారుచేసారు. పేద మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు. ధనికులైతే కొంత డబ్బు తీసుకుంటారు. కాన్సర్ పేషేంట్స్ ఏ సాయం కావాలన్నా ఈ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు. కాన్సర్ తగ్గిన రోగులకు వృత్తి విద్య శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు కవితా గుప్తా. సిలికాన్ తో తయారు చేసిన ప్రాస్తటిక్ లో దుస్తులు ఉచితం

Leave a comment