కొరియా సినిమా మిస్ గ్రానీ 74 ఏళ్ళ ఒక బామ్మ కథ. ఈ సినిమానే తెలుగులో రిమేక్ చేయబోతున్నారు. సమంత ముఖ్య పాత్రలో 2019 లో వచ్చే ఈ కామెడీ సినిమా జహ్ మిల్ సూన్ అనే ఆమె భర్త చిన్నప్పుడే చనిపోతే ఒక్కాగానొక్క కొడుకు కోసం ఓ కాఫీ షాప్ లో పని చేస్తూ బతుకుతుంది. కొడుకు పెళ్ళయి మనవడు పుడతాడు.ముసలావిడకి కొడుకు,మనవడు ప్రాణం కానీ కొడల్ని వేధించుకు తింటుంది. ఆమె పెట్టే బాధ భరించలేక కోడలు హాస్పిటల్ పాలయితే ఇక తల్లిని వృద్దాశ్రమంలో పెట్టాలనుకుంటాడు కొడుకు. ఆ దిగులుతో బయటకి వచ్చిన్న బామ్మ ఎదురుగా ఒక ఫోటో స్టూడియోలో ఫోటో తీయుంచుకుంటుండగా హటాత్తుగా 20 ఏళ్ళ అమ్మాయి అయిపోతుంది. ముసలి మనసులో యువతి శరీరంలో ఆమె జీవితం ఎలా నడిచిందో ఈ సినిమాలో ఉంది. ఎమోషన్ ,కామెడీ పుష్కలంగా ఉన్నా ఈ కొరియన్ సినిమాకు లెక్కలేనన్ని అవార్డులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 51.7 మిలియన్ డాలర్ల వసూళ్ళు వచ్చాయి.

Leave a comment