కొందరి జుట్టు 70 ఏళ్ళు వచ్చినా నల్లగా చక్కగా ఉంటుంది. మరికొందరికి పాతికెళ్ళు దాటుతూనే తెల్లబారిపోతుంది. ఇది జన్యువుల సమస్య అనుకుంటాం. కాని ఇంకా బోలెడు కారణాలు ఉన్నాయి అంటున్నాయి పరిశోధనలు. ఒకటి పోషకాహరం కావచ్చు అలగే విటమిన్ బీ 12 లోపించడం వల్ల జుట్టు కుదుళ్ళకు అవసరమైన మెలనిన్ సరిగ్గా అందక తెల్లబడి పోవచ్చు. అలగే విటమిన్ డీ3, కాల్షీయం, పెరిటిన్ శాతం తగ్గినా తెల్లబడి పోవచ్చు. ఒత్తిడితో వెంట్రుక కుదుళ్ళలో హైడ్రోజన్ పెరాక్సైడ్ పేరుకోవటం కూడా ఒక కారణం. ఎప్పటి నుంచో అనుకున్నట్లూ జన్యువుల వల్లనూ తెల్లజుట్టు రావచ్చు. చిన్నప్పటి నుంచి ఈ విషయాల్లో ఆహార నియమాల్లో శ్రద్దగా ఉంటే జుట్టు కాపాడుకోవచ్చు.

Leave a comment